Anupama Parameswaran: సినిమాల పట్ల అనుపమ పరమేశ్వరన్‌కు ఉన్న అంకితభావం, ప్రేమకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన కిష్కిందపురి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు అనుపమ పరమేశ్వరన్ అటెండ్ అయ్యింది. సాధారణంగా సినిమా ప్రమోషన్స్‌లో చాలా హుషారుగా కనిపించే అనుపమ కిష్కిందపురి ట్రైలర్ లాంఛ్‌లో చాలా డల్‌గా కనిపించింది. తనకు ఒంట్లో బాగాలేదని, జ్వరంతో బాధపడుతున్నానని.. అందుకే నీరసంగా కనిపిస్తున్నట్లు చెప్పింది అనుపమ. మన సినిమా కదా.. ఎలాగైనా ప్రమోట్ చేయాలనే జ్వరం ఉన్నా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు వచ్చానని అన్నది. సినిమాల పట్ల అనుపమకు ఉన్న ఇష్టం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అనుపమ కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా దక్కుతుందని అంటున్నారు.
దయ్యంగా అనుపమ…
కాగా కిష్కిందపురి ట్రైలర్‌లో అనుపమ దయ్యంగా కనిపించింది. తన క్యారెక్టర్‌తో పాటు డైరెక్టర్‌పై ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేసింది అనుపమ. హారర్ తన ఫేవరేట్ జానర్ అని అనుపమ చెప్పింది. ప్రాపర్ హారర్ మూవీ చేయాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎదురుచూస్తున్నానని, కిష్కిందపురితో ఆ కల తీరిందని అనుపమ పరమేశ్వరన్ అన్నది.
Also Read – OG movie : వామ్మో.. ఇదెక్కడి మాస్! ‘ఓజీ’ ఫస్ట్ టికెట్ రూ. 5 లక్షలు
టార్చర్ పెట్టాడు.
డైరెక్టర్ కౌశిక్ కిష్కిందపురి కథ చెప్పినప్పుడు ఏం అర్థం కాలేదు. కానీ అతడు కథను చెప్పిన విధానానికి ఇంప్రెస్ అయ్యి సినిమా అంగీకరించాను. క్లైమాక్స్‌లో నా క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంటుంది. సినిమాలోని డైలాగ్స్‌కు అర్థం తెలియాలంటే డిక్షనరీ ఉండాలి. డైలాగ్స్ చెప్పేటప్పుడు డబ్బింగ్ థియేటర్‌లో డైరెక్టర్ కౌశిక్ నన్ను టార్చర్ పెట్టాడు. చాలా కష్టపడి నాతో డబ్బింగ్ చెప్పించాడు అని అనుపమ పరమేశ్వరన్ చెప్పింది.
సెప్టెంబర్ 12న రిలీజ్…
కిష్కిందపురి మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైపర్ ఆది, తనికెళ్లభరణి, సుదర్శన్, భద్రం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా అనుపమ పరమేశ్వరన్ నటించిన గత మూవీ పరదా మంచి సినిమాగా పేరుతెచ్చుకున్న కమర్షియల్‌గా మాత్రం విజయాన్ని సాధించలేకపోయింది.


