Anupama Parameswaran: స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ప్రతి హీరోయిన్ కలలు కంటుంది. చిన్న సినిమాలు ఎన్ని చేసిన రాని పేరు, గుర్తింపు అగ్ర హీరోల సినిమాలతో వస్తుంది. టాప్ స్టార్స్‌తో సినిమా ఛాన్స్‌లు కొందరికి ఈజీగా వస్తాయి. మరికొందరు మాత్రం ఆ అవకాశాల కోసం ఏళ్లకు ఎళ్లు ఎదురుచూడాల్సివస్తుంది. అనుపమ పరమేశ్వరన్ విషయంలో రెండోదే జరుగుతోంది. సక్సెస్‌లతో పాటు టాలెంట్, స్టార్‌డమ్ అన్ని ఉన్నా స్టార్ హీరోలతో సినిమా విషయంలో అనుపమను బ్యాడ్‌లక్ వెంటాడుతుంది. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తొమ్మిదేళ్లయినా ఇప్పటివరకు స్టార్ హీరోలతో ఒక్కసినిమా కూడా చేయలేకపోయింది.
రంగస్థలం…
కెరీర్ ఆరంభంలో రామ్‌చరణ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ రంగస్థలంలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌కు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. రంగస్థలం మిస్సవ్వడానికి గల కారణాలను పరదా ప్రమోషన్స్‌లో అనుపమ పరమేశ్వరన్ రివీల్ చేసింది. రంగస్థలం వల్ల తాను ఆరు నెలలు సినిమాలు లేకుండా ఖాళీగా ఉండాల్సివచ్చిందని చెప్పింది. రంగస్థలం సినిమా మిస్సవ్వడంలో తన తప్పేంలేదని, కానీ పనిష్‌మెంట్ మాత్రం తానే అనుభవించాల్సివచ్చిందని అనుపమ తెలిపింది.
Also Read – Holidays: ఏపీ ,తెలంగాణ విద్యార్థులకు ఎగిరిగంతేసే న్యూస్…దసరా సెలవులు ఎన్ని రోజులో తెలుసా!
రూమర్లు వచ్చాయి…
“శతమానంభవతి బ్లాక్‌బస్టర్ తర్వాత రంగస్థలం సినిమాలో హీరోయిన్ రోల్ కోసం డైరెక్టర్ సుకుమార్ నన్ను అప్రోచ్ అయ్యారు. ఆ తర్వాత రామ్‌చరణ్, సుకుమార్‌లతో సినిమా చేయడం ఇష్టం లేకపోవడంతో నేనే ఆ సినిమాను వదలుకున్నట్లు రూమర్లు వచ్చాయి. అవి ఎవరూ క్రియేట్ చేశారో తెలియదు. ఆ రూమర్ కారణంగా నాకు వచ్చిన సినిమా ఆఫర్లు అన్ని చేజారాయి. ఆరు నెలలు ఒక్క అవకాశం రాలేదు. రంగస్థలం లో అవకాశం చేజారడంలో నా తప్పేం లేదు. అందులో హీరోయిన్‌గా ఎవరికి తీసుకోవాలన్నది మేకర్స్ ఇష్టం. రామ్‌చరణ్ సినిమాను రిజెక్ట్ చేసిందంటూ నన్ను ఫ్యాన్స్ ద్వేషించడం మొదలుపెట్టారు. ఆ రూమర్ వల్ల కెరీర్‌పై చాలా ఎఫెక్ట్ పడింది. ఆ టైమ్‌లో శతమానం భవతి పెద్ద హిట్టయ్యింది. కానీ ఈ పుకార్ల వల్ల సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేకపోయాను” అని అనుపమ పరమేశ్వరన్ అన్నది.
ఇరవై రోజుల గ్యాప్‌లో…
పరదా తో ఫస్ట్ టైమ్ లేడీ ఓరియెంటెడ్ జానర్‌లో సినిమా చేసింది అనుపమ పరమేశ్వరన్. ఈ మూవీలో మలయాళం నటి దర్శనా రాజేంద్రన్‌తో పాటు సంగీత కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 22న ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇరవై రోజుల గ్యాప్‌లోనే అనుపమ పరమేశ్వరన్ నటించిన మరో మూవీ కిష్కిందపురి థియేటర్లలోకి రాబోతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Also Read – PM Modi : ఎర్రకోట నుంచి సంఘ్‌కు జై.. స్వాతంత్య్ర స్ఫూర్తికి ద్రోహమన్న విపక్షాలు!


