Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAnupama Parameswaran: వైరల్‌గా మారిన మార్ఫింగ్ ఫొటోలపై అనుపమ పోస్ట్

Anupama Parameswaran: వైరల్‌గా మారిన మార్ఫింగ్ ఫొటోలపై అనుపమ పోస్ట్

Anupama Parameswaran: సినీ తారలకి సంబంధించిన ఫొటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తుండటం ఇప్పటికే ఎన్నోసార్లు చూశాము. గతంలో అయితే, వీడియోలను వెబ్‌సైట్ లలో అప్లోడ్ చేసేవారు. ఇప్పుడు ఏకంగా మార్ఫింగ్ చేసిన ఫొటోలను, వీడియోలను అన్నీ సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడం సునకానందం పొందటం చాలా చిన్న విషయంగా మారింది.

- Advertisement -

ఇప్పటికే, మన హీరో.. హీరోయిన్స్ చాలామందిని ఇలా ఇబ్బందులకి గురి చేశారు. ఇటీవల ఏ ఐ వచ్చాక ఇలాంటి దారుణాలు మరీ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్ లాంటి అగ్రతారలు మా అనుమతి లేకుండా మా ఫొటోలను, వీడియోలను వాడకూడదని కోర్ట్ నుంచి అనుమతులు తెచ్చుకున్నారు.

Also Read – Chiru-Charan: రికార్డులు సృష్ఠించాలంటే మెగా హీరోలే!

అయితే, యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇదే విషయమై తాజాగా ఓ పోస్ట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ‘ఇటీవల నాకు ఒక ఇన్స్టాగ్రాం ప్రొఫైల్ వచ్చింది. దీనిలో నా గురించి తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారు. అంతేకాదు, ఈ పోస్ట్ కి నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో పాటు సినీ ఇండస్ట్రీ వారిని కూడా ట్యాగ్ చేశారని రాసుకొచ్చింది. ఈ ప్రొఫైల్ లో కొన్ని మార్ఫింగ్ ఫొటోలున్నాయని ఈ సందర్భంగా అనుపమ తెలిపింది. ఇక, ఇదే సందర్భంగా వచ్చిన ప్రొఫైల్ లో ఎలాంటి ఆధారాలు లేని తప్పుడు సమాచారం కూడా ఉందని వెల్లడించింది.

అయితే, ఈ దారుణానికి పాల్పడింది ఓ 20 ఏళ్ళ అమ్మాయి అని కేరళ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అది తెలిసి షాకయ్యాను. ఆమె వయసు రిత్యా నేను ఎలాంటి చర్యలు తీసుకోకపోయినప్పటికీ, చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపింది అనుపమ. కాగా, ఇటీవల బైసన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ మంచి ప్రశంసలు అందుకుంది. ట్రెండ్ కి తగ్గట్టుగా అల్ట్రా మోడ్రన్ వేర్స్ తో పాటు ఇంటిమేట్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

Also Read – Rakul Preet Singh: చీరలో చెమటలు పట్టిస్తున్న రకుల్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad