Anupama Parameswaran: చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్‌తో అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో పడ్డట్లు చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. బైసన్ మూవీలో ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పట్లో వీరిద్దరి లిప్‌లాక్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. సీక్రెట్ లవ్‌స్టోరీ బయటపడకుండా ఇద్దరూ జాగ్రత్త పడుతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
బైసన్ ప్రమోషన్స్‌లో..
బైసన్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో అనుపమ పరమేశ్వరన్ బిజీగా ఉంది. ఓ ఈవెంట్‌లో ధృవ్ విక్రమ్‌తో డేటింగ్ నిజమేనా అంటూ పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు అవునని, కాదని సమాధానం చెప్పకుండా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేసింది అనుపమ. ఇదే ఈవెంట్‌లో ధృవ్ విక్రమ్‌ను తెగ పొగడింది. ధృవ్ డేడికేషన్ అద్భుతం, డౌన్ టూ ఎర్త్ పర్సన్, గ్రేట్ యాక్టర్ అంటూ పొగడ్తల మీద పొగడ్తలు కురిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఇద్దరూ చాలా క్లోజ్‌గా కనిపిస్తున్నారు. దాంతో ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ ప్రేమాయణం నిజమేనంటూ కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ చేసిన బైసన్ ప్రమోషనల్ కంటెంట్‌లో ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.
Also Read- NTRNEEL: ఎన్టీఆర్ డ్రాగన్ మళ్లీ వాయిదా – వైరలవుతున్న రూమర్
ఇదే ప్రాపర్ డెబ్యూ మూవీ
బైసన్ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ధృవ్ విక్రమ్ భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్‌గా తెరకెక్కిన వర్మ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ధృవ్ విక్రమ్. ఆ తర్వాత తండ్రి విక్రమ్‌తో కలిసి మహాన్ సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలు ఫెయిల్యూర్‌గానే నిలిచాయి. బైసన్‌తో ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు. హీరోగా ఇదే తన ప్రాపర్ డెబ్యూ మూవీ అంటూ ఇటీవల బైసన్ ప్రమోషన్స్‌లో ధృవ్ విక్రమ్ కామెంట్స్ చేశాడు.
లక్కీ స్టార్…
మరోవైపు అనుపమ పరమేశ్వరన్ తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో లక్కీస్టార్‌గా కొనసాగుతోంది. ఇటీవలే తెలుగులో కిష్కింధపురితో పెద్ద హిట్టు అందుకుంది. హారర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించాడు. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. డ్రాగన్, పరదాతో పాటు జానకి టీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది. ప్రస్తుతం తెలుగులో భోగి.. మలయాళంలో లాక్‌డౌన్, ది పెట్ డిటెక్టివ్ సినిమాలు చేస్తోంది.


