Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు శుక్రవారం (నేడు) రోజు రిలీజయ్యాయి. ఓ సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా మరో మూవీ ఓటీటీలో విడుదలైంది.
పరదా మూవీ…
అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ ఫిమేల్ సెంట్రిక్ మూవీ పరదా శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు శుభం ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించాడు. పరదా మూవీలో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు దర్శనా రాజేంద్రన్, సంగీత, రాగ్‌మయూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో సుబ్బు అలియాస్ సుబ్బలక్ష్మి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించింది. ఓ పల్లెటూళ్లో చాలా ఏళ్లుగా పేరుకుపోయినా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే యువతిగా పరదా మూవీలో అనుపమ పరమేశ్వరన్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.
ప్రమోషన్స్ భారం…
పరదా మూవీ కోసం అనుపమ పరమేశ్వరన్ చాలానే కష్టపడింది. పరదా మూవీని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లే బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. ప్రమోషన్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించింది. అనుపమ కష్టానికి తగ్గట్లుగా రిజల్ట్ దక్కుతుందా? లేదా? అన్నది చూడాల్సిందే.
Also Read – Parada : విభిన్న కథనంతో వచ్చిన అనుపమ హిట్టు అందుకుందా..లేదా..?
జానవి వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ…
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ జానకి వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ శుక్రవారం (నేటి) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్లర్ మూవీలో మలయాళం సీనియర్ హీరో సురేష్ గోపి కీలక పాత్రలో నటించారు.
చట్ట ప్రకారం ప్రతీకారం…
సెన్సార్‌తో పాటు టైటిల్ విషయంలో అనేక వివాదాలను ఎదుర్కొన్న ఈ మూవీ థియేటర్లలో సరైన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించాడు. తనకు జరిగిన అన్యాయంపై చట్ట ప్రకారం ఓ యువతి ఎలా రివేంజ్ తీర్చుకుంది అన్నదే ఈ మూవీ కథ.
కిష్కిందపురి… భోగి…
ప్రస్తుతం తెలుగులో బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది అనుపమ పరమేశ్వరన్. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటించిన హారర్ మూవీ కిష్కిందపురి సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతుంది. శర్వానంద్, సంపత్ నంది కలయికలో తెరకెక్కుతున్న భోగిలో కథానాయికగా కనిపించబోతుంది.
Also Read – kiran Abbavaram: మహేష్‌బాబు డైరెక్టర్‌తో కిరణ్ అబ్బవరం మూవీ – రానా ప్రొడ్యూసర్ – టైటిల్ ఇదేనా?


