Anupama Parameswaran Movies: టాలీవుడ్‌తో పాటు తమిళం, మలయాళ ఇండస్ట్రీలను కవర్ చేస్తుంది అనుపమ పరమేశ్వరన్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ మూడు భాషల్లో విజయాలు దక్కించుకుంటోంది. ఈ ఏడాది డ్రాగన్‌తో పెద్ద హిట్టును తన ఖాతాలో వేసుకుంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్లకుపైగా వసూళ్లను సొంతం చేసుకుంది. 2025లో తమిళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఏడు సినిమాలు…
ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో కలిపి ఏడు సినిమాలు చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల గ్యాప్‌లో అనుపమ నటించిన ఈ ఏడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. తెలుగులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన పరదాతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. పరదా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్‌చేశారు. ఆగస్ట్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. పరదా మూవీలో మలయాళ నటి దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రలో నటిస్తుంది. సినిమా బండి, శుభం సినిమాల ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read – SS Rajamouli: రాజమౌళి కెరీర్‌లో బెస్ట్ మూవీ అదేనట – ఆస్కార్ విన్నింగ్ మూవీకి హ్యాండిచ్చిన జక్కన్న
మిస్టిక్ థ్రిల్లర్…
రాక్షసుడు తర్వాత బెల్లకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న కిష్కిందపురి షూటింగ్ తుది దశకు చేరుకున్నది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఈ సినిమాను విడుదలచేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మిస్టిక్‌గా థ్రిల్లర్‌గా డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు తెలుగులో శర్వానంద్, సంపత్‌నంది సినిమాకు ఇటీవలే అనుపమ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబర్‌లో రిలీజయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
మలయాళంలో…
మాతృభాష మలయాళంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన జానకి వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఈ వారమే (జూలై 18న) థియేటర్లలోకి రాబోతోంది. కోర్ట్ రూమ్ డ్రామా మూవీలో మలయాళ సీనియర్ హీరో సురేష్ గోపి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సెన్సార్ పరమైన అడ్డంకులను దాటుకొని ఎట్టకేలకు ఈ మూవీ ప్రేక్షకల ముందుకు వస్తోంది. జానకి వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీ తెలుగు వెర్షన్ ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో థియేటర్లలోకి రానుంది. అనుపమ పరమేశ్వరన్ మరో మలయాళం మూవీ పెట్ డిటెక్టివ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో థియేటర్లలో సందడి చేయనుంది.
Also Read – Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి భారీ షాక్..బెయిల్ రద్దుచేసిన సుప్రీంకోర్టు
తమిళంలో రెండు సినిమాలు…
రెండు సినిమాలతో తమిళ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది అనుపమ. కర్ణన్, మామన్నన్ సినిమాల ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ హీరోగా బైసన్ పేరుతో స్పోర్ట్స్ యాక్షన్ సినిమా రూపొందుతోంది. అక్టోబర్ 17న రిలీజ్ కానున్న ఈ సినిమాలో ధృవ్ విక్రమ్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ కనిపించబోతున్నది. కేజీఎఫ్ ప్రొడక్షన్ హౌజ్ నిర్మించిన తమిళ ప్రయోగాత్మక మూవీ లాక్‌డౌన్‌లో అనుపమ పరమేశ్వరన్ ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది. ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ నవంబర్‌లో థియేటర్లలోకి రాబోతుంది.


