Anushka-Ghaati: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి నటించిన చివరి సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. నవీన్ పోలిశెట్టి ఇందులో కీలక పాత్ర చేశాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తిరగబడింది. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు ఘాటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.
Also Read – AA22 Update: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ – అల్లు అర్జున్, అట్లీ మూవీ రిలీజ్ అప్పుడేనట!
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఇంతకుముందు అనుష్క వేదం అనే సినిమా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్నేళ్ళకి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఘాటి సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. ఇక ఇందులో విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్య రావు తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది.
ఘాటి విడుదలకి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెంచి ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడానికి మేకర్స్ భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా నుండి యాక్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ యాక్షన్ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
ఘాటి మూవీ ట్రైలర్ విషయానికి వస్తే, దీనిలో యాక్షన్ పర్ఫామెన్స్ తో అనుష్క మెస్మరైజ్ చేశారు. ఈ సినిమా లేడీ బ్లడ్ బాత్ మూవీ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పాల్సిందే. అప్పట్లో అరుంధతి సినిమా ఎలా ఉందో మళ్ళీ అలాంటి సినిమా ఘాటి రూపంలో అనుష్క శెట్టికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఇందులో అనుష్కని గతంలో చూడని విధంగా క్రిష్ ఎంతో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. మరీ ముఖ్యంగా అనుష్క కూడా తన పాత్రలో పూర్తిగా లీనమైపోయి మరీ నటించారు.
Also Read – Rushikonda : రుషికొండను పిచ్చాసుపత్రిగా మార్చండి


