Anushka vs Rashmika: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు అనగానే అందరికి గుర్తొచ్చే ఒకే ఒక పేరు అనుష్క. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే అరుంధతి, రుద్రమదేవి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌ను అందుకున్నది స్విటీ. మహిళా ప్రధాన కథాంశాలతోనూ నంబర్ వన్ ప్లేస్‌కు చేరుకోవచ్చని నిరూపిస్తూ నవతరం హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచింది.
ఘాటి..
గత కొన్నేళ్లుగా సినిమాల జోరును తగ్గించిన అనుష్క (Anushka shetty) ప్రజెంట్ ఘాటి (Ghati) సినిమా చేస్తోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఘాటి మూవీ సెప్టెంబర్ 5న (Ghati release date) రిలీజ్ కాబోతున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
Also Read- Tollywood: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల జాతర.. ఒక్క రోజే ఎనిమిది సినిమాలు రిలీజ్
రష్మిక మందన్న మూవీ..
కాగా అదే రోజు మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ కూడా రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్ మిడిల్ లో గా షూటింగ్‌ను కంప్లీట్ చేసి సెప్టెంబర్ 5న (The Girl Friend Release date) ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లానింగ్‌లో ఉన్నట్లు సమచారం. టాలీవుడ్ టాప్ హీరోయిన్లు నటించిన రెండు ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ బాక్సాఫీస్ వార్‌లో అనుష్క, రష్మికలలో ఎవరూ విన్నర్ అవుతారన్నది చూడాల్సిందే.
విక్రమ్ ప్రభు..
ఘాటి మూవీతో తమిళ నటుడు విక్రమ్ ప్రభు (Vikram Prabhu) టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. క్రైమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కరుడుగట్టిన క్రిమినల్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో అనుష్క కనిపించబోతున్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
కన్నడ హీరోతో జోడీ..
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీలో రష్మికకు జోడీగా దసరా ఫేమ్, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బుధవారం ది గర్ల్‌ఫ్రెండ్ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.
Also Read- Bigboss telugu 9: బిగ్ బాస్ సీజన్ 9: సరికొత్త రూల్స్‌తో సందడికి సిద్ధం!


