Anushka Ghaati: లేడీ రెబల్ స్టార్ అనుష్క, డైరెక్టర్ క్రిష్ కలయికలో తెరకెక్కిన ఘాటీ మూవీ మండే టెస్ట్‌లో దారుణంగా ఫెయిలైంది. సోమవారం రోజు ఈ మూవీ కలెక్షన్స్ సగానికిపైగా డ్రాప్ అయ్యాయి . బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా ఘాటీ సాగుతోంది. అనుష్కకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ కారణంగా రిలీజ్‌కు ముందు ఘాటీకి మంచి హైప్ వచ్చింది. కమర్షియల్‌గా క్రిష్ గత సినిమాలు కొన్ని వర్కవుట్ కాకపోయినా డైరెక్టర్‌గా మాత్రం ఎప్పుడూ ఫెయిలవ్వలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్లే టీజర్, ట్రైలర్స్ ఫుల్ యాక్షన్‌తో ఆకట్టుకున్నాయి. కానీ కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకపోవడం, స్టోరీలో ల్యాగ్ ఎక్కువగా ఉండటంతో తొలిరోజే ఘాటీ సినిమా నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది.
కోట్ల నుంచి లక్షలకు…
మొదటి రోజు ఘాటీ అతి కష్టంగా రెండు కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. శని, ఆది వారాల్లో కలిపి మరో రెండు కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. కానీ సోమవారం రోజు మాత్రం బాక్సాఫీస్ వద్ద అనుష్క మూవీ పూర్తిగా తేలిపోయింది. వరల్డ్ వైడ్‌గా కేవలం 58 లక్షల వసూళ్లను మాత్రమే దక్కించుకున్నది.
యాభై శాతానికిపైగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.
ఓవరాల్‌గా నాలుగు రోజుల్లో అనుష్క ఘాటీ మూవీకి 5.47 కోట్ల కలెక్షన్స్ మాత్రమే దక్కించుకున్నది. ముప్పై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రిలీజైంది. ఇప్పటివరకు కనీసం ఇరవై శాతం కూడా రికవరీ సాధించలేకపోయింది. నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు ఘాటీ భారీగానే నష్టాలను మిగల్చబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఈ ఏడాది టాలీవుడ్‌లో అతి పెద్ద డిజాస్టర్స్‌లో ఒకటిగా ఘాటీ నిలవడం ఖాయమని అంటున్నారు.
అనుష్క ప్రమోషన్స్‌కు దూరం…
నెగెటివ్ కామెంట్స్‌కు తోడు అనుష్క ప్రమోషన్స్‌కు అటెండ్ కాకపోవడం గట్టి దెబ్బకొట్టింది. అనుష్క ప్రమోషన్స్‌లో పాల్గొని ఉంటే టాక్ యావరేజ్‌గా ఉన్న కలెక్షన్స్ మాత్రం బాగానే ఉండేవని అంటున్నారు. ఘాటీ మూవీలో విక్రమ్ ప్రభు హీరోగా నటించాడు. జగపతిబాబు, చైతన్యరావు కీలక పాత్రలు పోషించారు.
గంజాయి అక్రమ రవాణా బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు క్రిష్ ఘాటీ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో శీలావతి పాత్రలో అనుష్క యాక్టింగ్ బాగుందని అంటున్నారు. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టిందని కామెంట్స్ వినిపించాయి. అల్లు అర్జున్ పుష్ప 2తో ఈ సినిమాకు కంపేరిజన్స్ రావడం కూడా మైనస్‌గా మారింది. ఘాటీ మూవీతో దాదాపు రెండేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుష్క.
Also Read – Lady Finger: ఈ వ్యాధులు ఉన్నవారు బెండకాయ అస్సలు తినకండి.. తింటే ఇక అంతే..


