Ghaati OTT: అనుష్క లేటెస్ట్ మూవీ ఘాటీ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి క్రిష్ దర్శకత్వం వహించాడు. కోలీవుడ్ యాక్టర్ విక్రమ్ ప్రభు హీరోగా ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనుష్కకు తెలుగులో ఉన్న క్రేజ్, పాపులారిటీ కారణంగా ఘాటీపై రిలీజ్‌కు ముందు భారీగానే హైప్ ఏర్పడింది. కానీ రొటీన్ స్టోరీలైన్ కారణంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను మెప్పించలేక డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
అమెజాన్ ప్రైమ్‌లో…
తాజాగా ఘాటీ మూవీ ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. తొలుత ఆరు వారాల తర్వాతే ఘాటీని ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ అనుకున్నారు. కానీ థియేటర్ రిజల్ట్ ఎఫెక్ట్ కారణంగా అనుకున్నదానికంటే చాలా ముందుగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
Also Read- OG Review: సినీ ప్రపంచంలో రికార్డులు సృష్టిస్తున్న గంభీర..అదరగొడుతున్న ఓజీ!
ప్రమోషన్స్‌కు దూరం…
ఘాటీ మూవీలో జగపతిబాబు, చైతన్యరావు, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించారు. ఘాటీతో దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుష్క. సినిమా ప్రమోషన్స్‌లో అనుష్క పాల్గొనకపోవడం, రెండు, మూడు సార్లు రిలీజ్ వాయిదాపడటం ఘాటీకి మైనస్ అయ్యింది. స్టోరీ విషయంలో విమర్శలు వచ్చినా యాక్టింగ్‌లో అనుష్క మాత్రం అదరగొట్టిందని ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి. సామాన్య మహిళ నుంచి ఓ తెగకు లీడర్‌గా మారే క్యారెక్టర్‌లో అనుష్క వేరియేషన్స్ చూపించిన తీరు అద్భుతమంటూ ప్రశంసలు వచ్చాయి. దాదాపు ఇరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఐదు కోట్లలోపే కలెక్షన్స్‌ను దక్కించుకొని డిజపాయింట్ చేసింది.
ఘాటీ కథ ఇదే…
గంజాయి అక్రమ రవాణా బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ యాక్షన్ డ్రామాగా డైరెక్టర్ క్రిష్ ఘాటీని రూపొందించారు. తూర్పు కనుమల్లో కష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), అతడి తమ్ముడు కందుల నాయుడు (చైతన్యరావు) కలిసి గంజాయి దందా చేస్తుంటారు. గంజాయి పంటను పోలీసుల కంటపడకుండా రవాణా చేస్తుంటారు ఘాటీ తెగ కూలీలు. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కకపోవడంతో నాయుడు బ్రదర్స్‌కు వ్యతిరేకంగా దేశీరాజు (విక్రమ్ ప్రభు), అతడి మరదలు షీలావతి(అనుష్క) కలిసి కొత్త దందా మొదలుపెడతారు. నాయుడు బ్రదర్స్ దేశీరాజును ఏం చేశారు. తమ తెగను కాపాడుకోవడం కోసం షీలావతి ఎలాంటి పోరాటం సాగించింది అన్నదే ఈ మూవీ కథ.
Also Read- Bigg Boss: ప్రియ వర్సెస్ శ్రీజ.. థూ అని ఊసిన ప్రియా.. ఊస్తే ఎలా ఉంటదని దమ్ము సీరియస్..!


