Anushka: సినిమాకు ప్రమోషన్స్ కీలకం. ఓ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం.. ఆడియెన్స్‌ను థియేటర్స్‌కు రప్పించడం… ప్రమోషన్స్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఎంత మంచి సినిమా తీసినా ప్రమోషన్స్ లేకపోతే ఆ సినిమా జనాలకు రీచ్ కావడం కష్టమే. సినిమా తీయడానికి మేకర్స్ ఎంత కష్టపడతారో ప్రమోషన్స్ విషయంలో అంతే కేర్ తీసుకుంటారు. సినిమా ప్రమోషన్స్ విషయంలో హీరోహీరోయిన్లపైనే ఎక్కువగా బాధ్యతలు ఉంటాయి. ప్రమోషన్స్‌ను పూర్తిచేసిన తర్వాతే ఓ సినిమాకు సంబంధించి వారి బాధ్యతలు పరిపూర్ణమవుతాయి.
నయనతార….
కానీ కొందరు హీరోయిన్లు మాత్రం కేవలం షూటింగ్‌లలో మాత్రమే పాల్గొంటుంటారు. ప్రమోషన్స్‌లో అస్సలు కనిపించరు. కెరీర్ ఆరంభం నుంచి నయనతార ఈ రూల్‌ను పాటిస్తుంది. ఇప్పుడు నయన్ బాటలో అనుష్క నడుస్తోంది. అప్‌కమింగ్ మూవీ ఘాటి ప్రమోషన్స్‌కు అనుష్క దూరంగా ఉండనుందట. ఈ విషయాన్ని ఘాటి ప్రొడ్యూసర్స్ స్వయంగా వెల్లడించారు. ప్రమోషన్స్‌కు అటెండ్ కాననే కండీషన్ గురించి చెప్పిన తర్వాతే అనుష్క ఈ సినిమాను అంగీకరించిందని నిర్మాతలు అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా అనుష్క హాజరుకాకపోవచ్చునని చెప్పారు.
Also Read: JK Floods: వరద బీభత్సం.. 30 మంది భక్తులు మృతి!
యాభై కోట్లు…
అనుష్క ప్రమోషన్స్‌కు రాకపోయినా తెలుగు ఆడియెన్స్‌లో ఆమెకున్న ఫాలోయింగ్ ఘాటి సినిమాకు హెల్పవుతుందనే నమ్మకముందని పేర్కొన్నారు. అనుష్క, క్రిష్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ కారణంగా ఇప్పటికే ఘాటి నాన్ థియేట్రికల్ రైట్స్ 50 కోట్లకు అమ్ముడుపోయినట్లు నిర్మాతలు చెప్పారు. ఘాటి మూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్నాడు. సెప్టెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
రీఎంట్రీ…
ఘాటితో దాదాపు రెండేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది అనుష్క. చివరగా 2023లో రిలీజైన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్‌గా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా అనుష్క పాల్గొనలేదు.
బాహుబలికి మాత్రం మినహాయింపు…
కాగా ఘాటి ప్రమోషన్స్‌కు దూరంగా ఉండనున్న అనుష్క బాహుబలి రీ రిలీజ్ ప్రమోషన్స్‌లో మాత్రం పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ రీ రిలీజ్ కోసమ మేకర్స్ ఓ భారీ ప్రమోషనల్ ఈవెంట్‌తో పాటు కొన్ని స్పెషల్ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వీటిలో మాత్రం అనుష్క భాగం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: TTD : సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం .. శ్రీవారి ఆలయం మూసివేత


