Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభGhaati Review: అనుష్క ‘ఘాటి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Ghaati Review: అనుష్క ‘ఘాటి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

బ్యానర్స్ – ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యువీ క్రియేషన్స్
నటీనటులు – అనుష్క, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రవీంద్రన్ విజయ్, జగపతి బాబు, జిస్సుసేన్ గుప్తా, దేవికా ప్రియదర్శిని తదితరులు
దర్శకత్వం – క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు – రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి
సంగీతం – నాగవల్లి విద్యా సాగర్
సినిమాటోగ్రఫీ – మనోజ్ రెడ్డి కాటసాని
ఎడిటింగ్ – చాణక్య రెడ్డి తూరుపు

- Advertisement -

Ghaati Review: టాలీవుడ్‌లో అరుంధతితో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అనుష్క కేరాఫ్‌గా మారింది. అయితే ఈ మధ్య సినిమాలు చేయటంలో ఆమె ఆచి తూచి అడుగులేస్తోంది. అలాగే దర్శకుడు క్రిష్ కూడా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ తనదైన మార్క్‌ను సంపాదించుకున్నారు. వేదం తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా ఘాటి. తూర్పు కనుమల్లో గంజాయి వ్యాపారం చేయాలనుకునే విలన్స్, వారికి సాయపడే అమాయకపు జనాలు.. అసలేం జరిగిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. దర్శకుడు క్రిష్ సినిమాలను ఎలా తెరకెక్కించారు? అనుష్క తన నటనతో పాత్రకు ఎలా ప్రాణం పోసిందనే వివరాలు తెలియాలంటే ముందు కథలోకి వెళదాం…

Also Read – Akhanda 2: త‌మ‌న్ వ‌ల్లే ఆల‌స్యం – అఖండ 2 రిలీజ్‌పై బాల‌కృష్ణ కామెంట్స్ వైర‌ల్…

కథ –
Ghaati Review: శీలావతి (అనుష్క శెట్టి), దేశీ రాజు (విక్రమ్ ప్రభు) పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పట్నంలో బస్సు కండక్టర్‌గా శీలావతి పని చేస్తుంటే, దేశీరాజు ఓ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తుంటాడు. పెళ్లి లోపు బాగా డబ్బు సంపాదించాలనేది వారి కోరిక. ఈ క్రమంలో ఇద్దరు గంజాయి వ్యాపారులు కుందల నాయుడు (చైత్యన రావు), కాస్తల నాయుడు (రవీంద్రన్ విజయ్) ద్రవ రూపంలోని శీలావతి అనే గంజాయిని పశ్ఛిమ కనుమల్లో ఓ ముఠా తయారు చేస్తుందని తెలుసుకుంటారు. ఆ ముఠాకు దేశీరాజునే నాయకుడని వారికి తెలుస్తుంది. తన ఆధ్వర్యంలోనే ఈ ద్రవ రూప గంజాయి తయారవుతుందని తెలుసుకుంటారు. ఇంతకీ దేశీరాజు నాయకుడుగా కాకుండా ల్యాబ్ టెక్నీషియన్ గా ఎందుకుంటాడు. శీలావతి ఎందుకు బస్ కండక్టర్ గా వర్క్ చేస్తుంటుంది. గంజాయి ముఠాకు వీళ్లకు ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష –
Ghaati Review : శీలావతి పాత్రలో అనుష్క నటన బావుంది. కానీ ఆమె గతంలో తనదైన నటనతో లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచింది. కానీ ఎందుకనో ఘాటి సినిమాలో ఆమె నటన ఓకే అనిపించిందే కానీ.. వావ్ అనిపించేలా మాత్రం లేదనే చెప్పాలి. సెకండాఫ్‌లో శీలావతి పాత్ర ఎంతో ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఇంతకు ముందు ప్రస్తావించినట్లు అనుష్క ఓకే అనేలానే నటించింది. ఆమె పాత్రలో ఎమోషనల్ కనెక్టింగ్ కనిపించలేదు. అనుష్కకు జోడీగా నటించిన విక్రమ్ ప్రభు తన పాత్రకు న్యాయం చేశాడు. తన రోల్ గురించి గొప్పగా చెప్పుకునేంతగా లేదు. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పాలనుకుని చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.
కుందల నాయుడుగా నటించిన చైతన్య రావు తనదైన పెర్ఫామెన్స్‌తో మెప్పించాడు. గ్రే షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన జగపతిబాబు నవ్వించే ప్రయత్నం కూడా చేశాడు. తన పాత్రలో ఎలాంటి ట్విస్టులు, టర్న్స్ ఉండవు. జిస్సుసేన్ గుప్తా చిన్న పాత్రలోనే కనిపించాడు. తనలాంటి నటుడికి ఇంకా మంచి పాత్ర ఇచ్చుంటే బావుండేదనిపించింది. ఇంకా నటీనటులందరూ వారి పాత్రల్లో నటించారు. అయితే పాత్రలను డిజైన్ చేసిన తీరు గొప్పగా లేదు. అందుకనే సినిమా కనెక్టింగ్ గా అనిపించదు.

Also Read – Earth Quake:ఆప్ఘనిస్తాన్‌లో భూప్రకంపనలు..తీవ్రత ఎంతంటే..!

సాంకేతికంగా చూస్తే మ్యూజిక్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. నాగవల్లి విద్యా సాగర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం మెప్పించలేదు. సన్నివేశాలకు బలాన్నిచ్చేది నేపథ్య సంగీతం.. అయితే ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ నిరుత్సాహపరిచింది. సినిమాటోగ్రాఫర్ మనోజ్ రెడ్డి విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఘాట్స్‌ను తను కెమెరాలో బంధించిన తీరు అభినందనీయం. విజువల్స్ ఎఫెక్ట్స్ బాలేవు. సాధారణంగా క్రిష్ సినిమాలో డిఫరెంట్ కంటెంట్ తో పాటు చక్కటి డైలాగ్స్ కూడా ఉంటాయి. ఆయన తెరకెక్కించిన గత సినిమాలను గమనిస్తే ఆ విషయం మనకు స్ఫష్టమవుతుంది. కానీ సినిమాలో డైలాగ్స్ కనెక్టింగ్ గా లేవు. క్రిష్ మూవీ ఆశించిన స్థాయిలో మాత్రం లేదని ఘాటిని చూసిన ప్రేక్షకులు భావిస్తారనటంలో సందేహం లేదు.

చివరగా.. ఘాటి.. నిరుత్సాహపరించింది

రేటింగ్ – 2/5

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad