Anushka Ghaati Trailer: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఘాటి’. సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే పలు మార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ అయినప్పటికీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు విడుదల తేది ఖరారైంది. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే ప్రారంభంలోనే టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చేశాడు డైరెక్టర్. కొండ ప్రాంతాల్లో ఉండే ఘాట్‌లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బరువులు మోస్తూ ప్రయాణించే వారిని ఘాటి అంటారు. అలాంటి వారితో గంజాయి రవాణా చేయాలని కొందరు భావించి వారిని తమ చెప్పు చేతుల్లో ఉంచుకుంటారు. అలాంటి ఘాటీల సమూహంలో అనుష్క, విక్రమ్ ప్రభు సహాలు పలువురు ఉంటారు. అయితే ఒకానొక దశో ఘాటీలు మేం గంజాయి సరఫరా చేయమని అంటారు. దీంతో డ్రగ్ మాఫియా వారిపై దాడి చేసి చంపేస్తుంది. వారిపై అనుష్క ఎలా ప్రతీకారం తీర్చుకుందనేదే కథ. బాధితురాలు.. హంతకురాలైతే కథ ఎలా ఉంటుందో ట్రైలర్ లో మచ్చుకగా చూపించేశాడు క్రిష్.
అనుష్క తనదైన పంథాలో యాక్టింగ్‌తో దుమ్ము దులిపేసింది. విక్రమ్ ప్రభు కూడా మంచి రోల్ లో నటించాడు. ఇప్పటి వరకు చేయనటువంటి మాస్ రోరింగ్ పాత్రలో అనుష్క కనిపించబోతుందనేది ట్రైలర్‌తో స్పష్టమవుతుంది. తను సినిమాలో ఏం చెప్పాలనుకుంటున్నాననే విషయాన్ని డైరెక్టర్ టూకీగా చెప్పేశాడు. మరిప్పుడు సినిమాను సన్నివేశాలతో ఎంత ఆసక్తికరంగా తెరకెక్కించాడో చూడాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. వేదం తర్వాత అనుష్క, క్రిష్ కాంబోలో రాబోతున్న సినిమా ఇది. సినిమాపై అంచనాలైతే ఉన్నాయి. మరి క్రిష్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అవుతాడో లేదో మరి.
Also Read – Rakul Preet Singh : బులెట్ కాఫీతో డే స్టార్ట్ చేసి..దూసుకుపోవడమే..రకుల్ రహస్యం!
డైరెక్టర్ క్రిష్ ఏ సినిమా చేసినా రిలీజ్ వాయిదాలు అతడిని వెంటాడుతూనే ఉన్నాయి. క్రిష్ సినిమా అంటేనే రిలీజ్ డేట్స్ మారడం, పోస్ట్‌పోన్ కావడం కామన్ అయిపోయింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన హరిహరవీరమల్లు దాదాపు పన్నెండు సార్లు రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. హరిహరవీరమల్లు నుంచి మధ్యలోనే తప్పుకున్న క్రిష్.. అనుష్కతో ఘాటి సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చారు. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ రిలీజ్ డేట్ ఇప్పటికీ రెండుసార్లు మారింది.
ఘాటి సినిమాను ముందుగా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు క్రిష్ ప్రకటించాడు. కానీ పోస్ట్‌ప్రొడక్షన్ పనులు డిలే కావడంతో జూలై 11కు వాయిదావేశారు. ఈ డేట్‌కు కూడా సినిమా థియేటర్లలోకి రాలేదు. ప్యాచ్ వర్క్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అంటూ ఇంకా ఈ సినిమాపై క్రిష్ ఓ క్లారిటీకి రావటంతో మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
Also Read – Mrunal-Dhanush: ధనుష్ ఫ్యామిలీతో మృణాల్ క్లోజ్ – డేటింగ్ రూమర్స్‌లో కొత్త ట్విస్ట్


