Anushka Shetty: టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో అనుష్క చేసినన్ని వెరైటీ రోల్స్ ఎవరూ చేయలేదు. స్టార్‌డమ్, ఇమేజ్ పట్టింపులతో సంబంధం లేకుండా ప్రయోగాలకు ప్రాధాన్యతనిచ్చింది. స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చూస్తేనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటించింది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి వంటి సినిమాలతో ట్రెండ్ సెట్ చేసింది. ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ అనుష్కకు ఎంత పేరు తెచ్చాయో అంతే మైనస్‌గా నిలిచాయి. సైజ్ జీరో మూవీ కోసం బరువు పెరిగింది. కానీ ఈ ప్రయోగం బెడిసికొట్టడమే కాకుండా అనుష్క కెరీర్‌ను చాలా డ్యామేజ్ చేసింది.
ఘాటీ డిజాస్టర్…
లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఘాటీతో లేడీ ఓరియెంటెడ్ జానర్‌ను టచ్ చేసింది అనుష్క. ఈ సినిమా కూడా జేజమ్మకు నిరాశనే మిగిల్చింది. క్రిష్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అనుష్క కెరీర్‌లోనే దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న సినిమాకు పోటీ ఇవ్వలేక వారం కూడా కాకముందే థియేటర్లలో కనిపించకుండాపోయింది. ఘాటీలో అనుష్క యాక్టింగ్ బాగుందనే కామెంట్స్ వచ్చిన క్రిష్ టేకింగ్, స్టోరీలో కొత్తదనం మిస్సయ్యాకంటూ కామెంట్స్ వచ్చాయి. ప్రమోషన్స్‌కు అనుష్క దూరం కావడం కూడా దెబ్బకొట్టింది. ఘాటీ డిజాస్టర్ ఎఫెక్ట్‌తో అనుష్క షాకింగ్ డెసిషన్ తీసుకుంది. సోషల్ మీడియాకు కొన్నాళ్లు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించింది.
జీవితాన్ని గుర్తుచేసుకోవడానికి…
ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్‌లో తానే స్వయంగా రాసిన ఓ నోట్‌ను పోస్ట్ చేసింది అనుష్క. సరైన జీవితాన్ని గుర్తుచేసుకోవడానికి, ప్రపంచంతో తిరిగి కనెక్ట్ కావడానికి కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ఈ నోట్‌లో అనుష్క పేర్కొన్నది. త్వరలోనే మరిన్ని మంచి కథలతో, మరింత ప్రేమతో అందరి ముందుకు వస్తానని అనుష్క తెలిపింది. ఘాటీ ఫెయిల్యూర్ కావడం వల్లే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుష్క నిర్ణయం తీసుకుందని అంటున్నారు. సోషల్ మీడియా నుంచే ఘాటీ సినిమాకు చాలా వరకు నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. ఈ నెగిటివిటీ నుంచి కొన్నాళ్లు దూరంగా ఉండాలని అనుష్క ఫిక్సైనట్లు చెబుతున్నారు.
మలయాళంలోకి ఎంట్రీ…
హీరోయిన్‌గా అనుష్క ఈ ఏడాది మలయాలంలోకి అడుగుపెట్టబోతుంది. కథనార్ పేరుతో మలయాళంలో ఓ హారర్ మూవీ చేసింది. జయసూర్య హీరోగా నటించిన ఈ మూవీ ఆక్టోబర్‌లో రిలీజ్ కాబోతుంది. మరోవైపు తెలుగులో కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఘాటీ ప్రమోషన్స్‌లో అనుష్క వెల్లడించింది. డిసెంబర్‌లో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
Also Read – Bigg Boss New Promo: ఆ ముగ్గురు ఆడోళ్లని నాకు తెల్వదు.. నోరు జారిన హరీష్


