Anushka Shetty: అనుష్క శెట్టి.. సూపర్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్ళు అవుతోంది. ఈ విషయం అనుష్క కూడా నమ్మరేమో. ఎందుకంటే కేవలం ఒకే ఒక్క సినిమా చేసి వెళ్ళిపోదామనుకున్నారు. కానీ, ఆ ఒక్క సినిమా తర్వాత ప్రేక్షకులు ఆమె మీద చూపించిన అభిమానానికి, సినీ పరిశ్రమ చూపించిన ప్రేమకి ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. పేరు అనుష్క శెట్టి అయినప్పటికీ, స్వీటీ అనే ప్రతీ ఒక్కరు పిలుచుకుంటున్నారు.
సాధారణంగా హీరోయిన్ అంటే కొన్ని పాత్రలకే.. మరీ ముఖ్యంగా గ్లామర్ రోల్స్ కోసమే అన్నది ఓ కొలమానం. కానీ, అనుష్క అలా కాదు. అరుంధతి, భాగమతి లాంటి సినిమాలు.. వాటిలో పాత్రలు, ఆమె కోసమే తయారైయ్యాయని చెప్పక తప్పదు. కథ నచ్చితే అనుష్క ఎలాంటి రిస్క్ చేయడానికైనా వెనకాడరు. అలా ఒప్పుకున్న సినిమా ‘సైజ్ జీరో’. ఈ సినిమాలో పాత్ర కోసం అనుష్క ఎంతో శ్రమించింది. ఈ పాత్ర కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నారు. కానీ, ‘సైజ్ జీరో’ సినిమా తర్వాత నా కెరీర్ ఏంటీ..? అని మాత్రం ఆలోచించలేకపోయారు.
Also Read- Viral Video: ఇంట్లోకి దూరిన భయంకరమైన పాము.. ఈ బుడ్డది ఎలా బయటకు పంపించిందో చూశారా?
బాహుబలి పార్ట్ 1 తర్వాత వచ్చిన ‘సైజ్ జీరో’ నటన పరంగా అనుష్కకి మంచి ప్రశంసలు దక్కాయి. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో వచ్చిన ‘సైజ్ జీరో’ ఫ్లాప్ అయింది. కానీ, ఇలాంటి ప్రయోగం చేసినందుకు ప్రకాష్ కి కూడా మంచి ప్రశంసలే దక్కాయి. అయితే, ఈ సినిమా కోసం బాగా లావెక్కిన అనుష్క, బాహుబలి పార్ట్ 2 కోసం మళ్ళీ సన్నబడాల్సి వచ్చింది. అయినా కూడా సినిమా చూస్తే కొన్ని చోట్ల అనుష్క లావుగానే కనిపిస్తుంది. అయితే, బాహుబలి పార్ట్ 2 తర్వాత మాత్రం అనుష్కకి ఆశించిన విజయాలేవీ దక్కడం లేదు.
ఎంత శ్రమించినప్పటికీ, మునుపటి రూపంలోకి రాలేకపోతున్నారు. ‘నిశ్శబ్దం’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక, ఇటీవల క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఘాటి’ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. చెప్పాలంటే, ఈ సినిమాలోనూ అనుష్క ఫిజిక్ చూడటానికి మునుపటిలా కనిపించలేదు. కథ బావున్నా.. కథనం ఆసక్తిగా లేకపోవడం, అనుష్క స్థాయికి సినిమాను రూపొందించకపోవడం బాగా మైనస్ అయి ఫ్లాప్ టాక్ తో సరిపెట్టుకుంది. మరి, ఈ ఫలితం తర్వాత అనుష్క శెట్టి కొత్త సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


