Anushka: ఈ ఏడాది ఘాటీ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుష్క. క్రిష్ దర్శకత్వంలో యాక్షన్ రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఘాటీ డిజాస్టర్‌గా నిలిచినా అనుష్క మరో సినిమా బాహుబలి ఎపిక్ మాత్రం వసూళ్లను రాబట్టింది. బాహుబలి రెండు భాగాలను కలిపి ఒకే పార్ట్‌గా ఇటీవల రిలీజ్ చేశారు. రీ రిలీజ్‌లోనూ ఈ మూవీ యాభై కోట్ల వరకు వసూళ్లను దక్కించుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.
కాగా తన బర్త్‌డే సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది అనుష్క. కథనార్ మూవీతో మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది స్వీటీ. పీరియాడిక్ హారర్ ఫాంటసీగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. రొజీన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు.
అనుష్క బర్త్‌డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం మేకర్స్ రిలీజ్ చేశారు. పట్టుపురుగుల మధ్యలో కూర్చొని డిఫరెంట్ లుక్‌లో అనుష్క కనిపిస్తోంది. ఈ పోస్టర్‌లో అనుష్క స్లిమ్ లుక్‌లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. నీలా అనే క్యారెక్టర్‌లో అనుష్క కనిపించబోతున్నట్లు ప్రకటించారు. నీలా కథ అందరికి తెలిసింది కాదు. కాలం చేత తిరిగిరాయబడినది అంటూ పోస్టర్‌ను ఉద్దేశించి మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది. కథనార్ మూవీలో అనుష్క నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆత్మగా ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో అనుష్క కనిపిస్తుందని అంటున్నారు.
దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో కథనార్ మూవీ రూపొందుతోంది. మలయాళం ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా తెరకెక్కుతోంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, చైనీస్, కొరియన్, ఇటాలియన్‌తో పాటు పలు విదేశీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. కథనార్ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ప్రభుదేవా, వినీత్‌తో పాటు సాండీ మాస్టర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read – Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్‌కి విజయ్ దేవరకొండ సాయం.. రివీల్ చేసిన రష్మిక!
Not the tale you know, but the one rewritten by time.!
A timeless beauty..
Happy Birthday, dear #AnushkaShetty. The face of our Nila &… #Kathanar #Kathanarthewildsorcerer @GokulamMovies @GokulamGopalan #RojinThomas@Actor_Jayasurya#BaijuGopalan #VCPraveen#Krishnamoorthy pic.twitter.com/D4GKThpHXu
— SreeGokulamMovies (@GokulamMovies) November 7, 2025
ఘాటీ తర్వాత అనుష్క నెక్స్ట్ తెలుగు మూవీ ఏదన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ కల్కి 2లో అనుష్క హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఈ సీక్వెల్ నుంచి దీపికా పదుకొనె తప్పుకుంది. దీపికా స్థానంలో అనుష్క కల్కి 2లో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.


