Anushka: ఘాటీ మూవీతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుష్క. క్రిష్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అనుష్క అదరగొట్టిన ఆమె ఇమేజ్‌కు తగ్గట్లుగా పవర్‌ఫుల్ స్టోరీని రాసుకోలేకపోయాడు క్రిష్. అతడి టేకింగ్‌లోనూ మునుపటి మ్యాజిక్ కనిపించకపోవడంతో ఘాటీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఘాటీ కోసం దాదాపు రెండేళ్లు కష్టపడింది అనుష్క. ఆమె కష్టానికి తగ్గ రిజల్ట్ మాత్రం రాలేదు.
మలయాళంలోకి ఎంట్రీ…
కాగా త్వరలోనే అనుష్క మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. కథనార్ పేరుతో ఓ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ చేస్తోంది. దాదాపు 75 కోట్ల వ్యయంతో మలయాళ ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా కథనార్ రూపొందుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read – Rajasekhar: తమిళ రీమేక్‌లో రాజశేఖర్ – మరో మిస్టేక్ చేస్తున్నాడా?
విలన్‌గా అనుష్క…
కాగా కథనార్‌లో అనుష్క పాత్ర నెగెటివ్ షేడ్స్‌లో సాగుతుందట. ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా జేజమ్మ కనిపించనుందట. ఈ విషయాన్ని కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ చెప్పాడు. అతడు కూడా కథనార్‌లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాను, అనుష్క ఈ మూవీలో డెవిల్స్‌గా కనిపిస్తామని అన్నారు. ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఇద్దరి పాత్రలు సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయని శాండీ మాస్టర్ అన్నారు.
కథనార్‌లో జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. సూపర్ హీరో తరహాలో సాగే ప్రీస్ట్ రోల్ జయసూర్య కనిపిస్తాడట. హీరోకు ధీటుగా అనుష్క విలనిజం పీక్స్‌లో సాగుతుందట. ఇద్దరి పాత్రలు పోటాపోటీగా సాగుతాయని మలయాళ సినీ వర్గాలు చెబుతున్నాయి. డెవిల్స్ గ్యాంగ్‌కు లీడర్‌గా అనుష్క నటిస్తుందని అంటున్నారు. ఘాటీ ప్రమోషన్స్‌లో పవర్‌ఫుల్ విలన్ రోల్ చేయాలనుందని అనుష్క చెప్పింది. కథనార్ గురించే ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చినట్లు టాక్.
ఫారిన్ లాంగ్వెజెస్‌లో…
కథనార్ సినిమాను భారతీయ భాషలతో పాటు చైనీస్, కొరియన్, ఇంగ్లీష్, ఇటాలియన్, రష్యన్ భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. కేరళలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా డైరెక్టర్ రొజీన్ థామస్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
Also Read – Akhanda 2: 600 మంది డానర్స్‌తో అఖండ 2 సాంగ్.. ఫ్యాన్స్ ఊగిపోవటం పక్కా!
కల్కి 2లో…
ఘాటీ తర్వాత తెలుగులో అనుష్క ఓ సినిమాను అంగీకరించిందట. డిసెంబర్‌లో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. మరోవైపు ఇటీవల కల్కి 2 నుంచి దీపికా పదుకొనెను పక్కనపెట్టారు. ఈ రోల్‌లో అనుష్క కనిపించే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.


