Pawan Wishes Balakrishna: సీనియర్ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ బసవతారకం హాస్పిటల్స్ చైర్మన్‌గా ప్రజలకు సేవ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందుకు గానూ ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)లో బాలకృష్ణ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ అరుదైన గుర్తింపు దక్కించుకున్న తొలి నటుడుగా బాలకృష్ణ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ సందర్భంలో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.
తాజాగా ఈ లిస్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరారు. ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా బాలకృష్ణకు అభినందనలు తెలియజేశారు. ‘బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సాధించిన ప్రముఖ నటులు, హిందూపురం MLA, పద్మ భూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
సినీ నటుడిగా వరుస విజయాలు సాధిస్తూ.. మరోవైపు సేవా కార్యక్రమాలలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న నందమూరి బాలకృష్ణ మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా గత 15 సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తోన్న ఆయనకు యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో ప్రాధాన్యమైన స్థానం లభించింది. ఈ గుర్తింపు పొందిన మొదటి భారతీయ నటుడిగా బాలయ్య ఖ్యాతి పొందడం గర్వకారణం. ఇది దేశ సినీ రంగ చరిత్రలో ఒక మైలురాయి అనే చెప్పాలి.
Also Read – Revanth Reddy: ఓయూలో రేవంత్ రెడ్డి పర్యటన – కొత్త లైబ్రరీ, హాస్టళ్ల ప్రారంభం
ఈ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ..‘హీరోగా బాలకృష్ణ జర్నీఇండియన్ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలుస్తుంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కటం ఆయన కృషికి నిదర్శనం’ అన్నారు.
ఇటీవలే భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో, ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ లభించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆయన నటనకు కొత్త ఒరవడిని ఇచ్చిన “భగవంత్ కేసరి” సినిమాకు జాతీయ అవార్డు రావడం కూడా అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు చేసింది.
ఈ వరుస విజయాలకు చక్కటి కొనసాగింపుగా, బాలకృష్ణ పేరు ఇప్పుడు యూకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో స్థానం దక్కించుకుంది. సినీ రంగంలో ఆయన ప్రతిభకే కాదు, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా గత 15 సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. దేశంలో ఈ రికార్డ్‌లో స్థానం పొందిన ఏకైక నటుడిగా బాలయ్య నిలవడం విశేషం. ఈ అరుదైన గుర్తింపుపై సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 30వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణను అధికారికంగా ఘనంగా సత్కరించనున్నారు.
Also Read – Revanth Reddy: ఓయూలో రేవంత్ రెడ్డి పర్యటన – కొత్త లైబ్రరీ, హాస్టళ్ల ప్రారంభం


