Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభOG Movie: పవన్ కల్యాణ్ 'ఓజీ'పై అంచనాలు రెట్టింపు.. టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ...

OG Movie: పవన్ కల్యాణ్ ‘ఓజీ’పై అంచనాలు రెట్టింపు.. టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ అనుమతి

OG Movie : పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 25న రాత్రి 1 గంటకు ప్రత్యేకంగా ప్రదర్శించే బెనిఫిట్ షోకి రూ.1000 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధరను అనుమతించింది. దీనితోపాటు, అక్టోబర్ 25 నుంచి నవంబర్ 4 వరకు పది రోజుల పాటు టికెట్ ధరలను అదనంగా పెంచుకునేందుకు కూడా అనుమతులు ఇచ్చింది.

- Advertisement -

ఈ పెంపు సింగిల్ స్క్రీన్‌లలో రూ.125 (జీఎస్టీతో సహా), మల్టీప్లెక్స్‌లలో రూ.150 (జీఎస్టీతో సహా)గా ఉండనుంది. ఈ నిర్ణయం పట్ల చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైనర్స్ ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌లకు ధన్యవాదాలు తెలియజేసింది.

దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీర్ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. తమన్ ఈ సినిమా నేపథ్య సంగీతంలో జపాన్ వాయిద్య పరికరం ‘కోటో’ను ఉపయోగించి కొత్త ఒరవడిని సృష్టించారు.

అంతేకాకుండా, లండన్‌లోని ఒక ప్రఖ్యాత స్టూడియోలో 117 మంది సంగీత కళాకారులతో కలిసి కొన్ని కీలక సన్నివేశాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ క్రియేట్ చేశారు. ఈ అంశాలన్నీ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. ‘ఓజీ’ పవన్ కల్యాణ్ అభిమానులకు ఒక గొప్ప విజువల్ ట్రీట్ అవుతుందని, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad