ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ ఛాతి నొప్పి కారణంగా చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో అత్యవసర విభాగంలో చేరారు. తాజాగా లండన్ నుండి చెన్నైకి ప్రయాణిస్తుండగా రెహమాన్‌కి ఒక్కసారిగా గుండెలో నొప్పి వచ్చిందని, దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారని సమాచారం. అయితే ఈ వార్తలపై రెహమాన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.
భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన స్వర మాంత్రికుడు రెహమాన్. ట్రెడిషనల్ క్లాసిక్స్ నుంచి పాప్ వరకూ అన్ని రకాల మ్యూజిక్స్‌ను మిక్స్ చేసి మ్యాజిక్ చేసిన లెజెండ్. తమిళ సినిమాలతో పాటు..కొన్ని తెలుగు సినిమాలకు సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా రోజా సినిమాతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఏఆర్ రెహమాన్.. తెలుగులో డైరెక్ట్‌గా మొదటిసారి మ్యూజిక్ ఇచ్చిన సినిమా పల్నాటి పౌరుషం.
ఆ తర్వాత తెలుగులో వెంకటేష్, నగ్మా, సౌందర్య హీరో హీరోయిన్లుగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కే.మురళీ మోహన్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూపర్ పోలీస్’ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. తరుణ్ హీరోగా శ్రియ, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాకు సంగీతం అందించారు. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న RC 16 సినిమాకి రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాలుగు పాటలను ఇప్పటికే రెహమాన్ కంపోజ్ చేశారని సమాచారం. ఇటీవల విడుదలైన ఛావ సినిమాకి రెహమాన్ సంగీతం అందించారు.
మ్యూజిక మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్, సైరా బాను విడాకుల ప్రకటన ఎంతోమందిని షాక్‌కి గురిచేసింది. ఇక గతేడాది ఏ.ఆర్ రెహమాన్.. తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. ఇక రెహమాన్ ఆసుపత్రిలో చేరారనే వార్తలు వినగానే అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.