Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభAR Rahman: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు.. స్పందించిన పిల్లలు..

AR Rahman: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు.. స్పందించిన పిల్లలు..

AR Rahman: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరాబాను(Saira Banu) దంపతులు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ విడాకులపై వారి పిల్లలు స్పందించారు. తమ తల్లిదండ్రుల విడాకుల విషయంలో గోప్యత పాటిస్తూ.. గౌరవంగా వ్యవహరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. ఈ సమయంలో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నామని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

మరోవైపు విడాకులపై ఏఆర్ రెహమాన్ (AR Rahman) కూడా స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించాం. అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’’ అని రాసుకొచ్చారు. కాగా ఏఆర్‌ రెహమాన్‌, సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెళ్లి జరిగిన 29 ఏళ్ల తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించడం అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యానికి గురయ్యాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad