Shalini Pandey Re- Entry: అర్జున్ రెడ్డి మూవీ టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌సెట్టర్. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. హీరోగా విజయ్ దేవరకొండ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ బ్లాక్‌బస్టర్‌తో స్టార్ లీగ్‌లో అడుగుపెట్టాడు విజయ్. అర్జున్ రెడ్డి సక్సెస్‌తో సందీప్ వంగా టాప్ డైరెక్టర్‌గా మారాడు. అర్జున్ రెడ్డి మూవీ హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా చాలా మంది జీవితాలను మార్చేసింది. కానీ హీరోయిన్ షాలిని పాండే మాత్రం అర్జున్ రెడ్డి క్రేజ్‌ను క్యాష్ చేసుకోలేకపోయింది. అర్జున్ రెడ్డితోనే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే. ఈ మూవీలో ప్రీతి క్యారెక్టర్‌లో తన యాక్టింగ్‌తో మెప్పించింది.
హీరోయిన్‌గా…
అర్జున్ రెడ్డి సక్సెస్‌తో షాలిని పాండేకు తెలుగులో చాలానే అవకాశాలు వచ్చాయి. ఇద్దరిలోకం ఒకటే, 118, నిశ్శబ్ధం సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. కానీ కథల ఎంపికలో తప్పటడుగుల కారణంగా ఈ సినిమాలేవి సక్సెస్‌గా నిలవలేదు.. హిందీలో కొన్ని మూవీస్ చేసినా అక్కడ లక్ కలిసి రాలేదు. చివరగా గత ఏడాది రిలీజైన హిందీ సినిమా మహారాజ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది షాలిని పాండే. ఆమిర్‌ఖాన్ కొడుకు జునైద్‌ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఓటీటీలోనూ షాలిని పాండేకు హిట్టు దక్కలేదు.
Also Read – Ghattamaneni Bharathi: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న మహేష్‌బాబు అన్న కూతురు – డైరెక్టర్ తనయుడితో సినిమా…
చెల్లెలిగా…
ప్రస్తుతం కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తోంది షాలిని పాండే. ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తమిళ మూవీ ఇడ్లీకడై షాలిని పాండే ఓ కీలక పాత్ర పోషిస్తుంది. షాలిని పాండేది హీరోయిన్ రోల్ అంటూ ప్రచారం జరిగింది. ఆ వార్తల్లో నిజం లేదట. ఇడ్లీకడై మూవీలో ధనుష్ చెల్లిగా షాలిని పాండే కనిపించబోతుందట. చెల్లెలి పాత్రే అయినా కథలో కీలకంగా ఉంటుందని అంటున్నారు. ధనుష్, షాలిని పాండే కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయని చెబుతోన్నారు. ఈ సినిమాలో షాలిని పాండే రొమాంటిక్ పెయిర్‌గా అరుణ్ విజయ్ కనిపిస్తాడని అంటున్నారు.
ఆరేళ్ల తర్వాత…
కాగా ఈ మూవీతో ఆరేళ్ల తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది షాలిని పాండే. తమిళంలో 2019లో 100 పర్సెంట్ కాదల్, గోరిళ్లా సినిమాలు చేసింది షాలిని పాండే. ఆ తర్వాత కోలీవుడ్‌కు దూరమైన షాలిని పాండే మళ్లీ ఇడ్లీకడైతో మళ్లీ తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇడ్లీ కడై మూవీలో నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యారజ్, పార్తిబన్, సముద్రఖని కీలక పాత్రలు పోసిస్తున్నారు. అక్టోబర్ 1న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
Also Read – Swachh vidyalaya : బడికి లక్షల పంట.. ‘స్వచ్ఛ విద్యాలయ్’ పురస్కారంతో కేంద్రం చేయూత!


