నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా నటిస్తున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi) మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ‘నాయాల్ది’ అంటూ సాగే ఈ మాస్ పాటను రఘురామ్ రాయగా నాకాష్ అజీజ్, సోని ఈ పాటను పాడారు. ఈ సినిమాలో అలనాటి నటి విజయశాంతి(Vijayashanthi) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో విజయశాంతి– కళ్యాణ్ రామ్ తల్లికొడుకులుగా నటించబోతున్నారు.
అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సోహెల్ ఖాన్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కాంతార’ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.