Ashika Ranganath: సినీ ఇండస్ట్రీలో భాష ఏదైనా హీరోలకు ఉన్నంత లాంగ్ లైఫ్ టైమ్.. హీరోయన్లకు మాత్రం ఉండదు. ఇది ఎవరి విషయంలోనైనా ఒప్పుకొని తీరాల్సిందే. సక్సెస్ లు వచ్చి లక్ కలిసొస్తే అనుష్క, తమన్నా, నయనతార లాంటి వారిలా ఓ 15 ఏళ్ళు హీరోయిన్స్ గా కొనసాగుతారు. ఆ తర్వాత ఖచ్చితంగా బ్రేక్ పడాల్సిందే. అదే హీరోలు చూడండి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చినా, ఇంకా హీరోగానే క్రేజ్ తో కొనసాగుతుంటారు. బ్యాగ్రౌండ్ ఉంటే ఫ్లాపులొస్తున్నా హీరోగానే కొనసాగుతారు.
ఒకవేళ హీరోయిన్ కి ఫ్లాపులొస్తే మాత్రం పక్కన కూర్చోవాల్సిందే. ఇక మరికొందరు హీరోయిన్స్ చాలా నెమ్మదిగా అవకాశాలు అందుకుంటూ… ఆచితూచి అడుగులు వేస్తుంటారు. అంతేకాదు.. మన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత ఉంది కాబట్టి.. ఎక్కువగా సీనియర్ హీరోలకి సూటయ్యే అందం, అభినయం ఉంటే సీనియర్స్ పక్కనే ఛాన్సులు అందుకుంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఇప్పుడు ఆషిక రంగనాథ్ చేరిందనుకోవచ్చు.
Also Read – Silver Rate: తెలుగు రాష్ట్రాల్లో ప్రజల మతిపోగొడుతున్న వెండి రేట్లు.. పేదోడి బంగారానికి ఏమైంది..?
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆషికా రంగనాథ్, ఈ సినిమాతో ఆశించిన రేంజ్ లో సక్సెస్ చూడలేదు. అయినా, కూడా ఆ తర్వాత అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగా’ సినిమాలో ఆయన పక్కన హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది ఆషికా. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఇండస్ట్రీలో ఆషిక గురించి చర్చ మొదలైంది. అందంతో పాటు అభినయం ఉన్న హీరోయిన్ గా సినీ ప్రముఖులను ఆకట్టుకుంది.
‘నా సామిరంగ’ తర్వాత ఆషికా కి ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీలో ఓ హిరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా హిట్ అయితే ఆషికా కెరీర్ ఇంకో లెవల్ లో ఉంటుంది. ఇక ఇదే ఊపులో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా సంప్రదించినట్టు తాజా సమాచారం. రవితేజ నటించిన ‘మాస్ జాతర’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ తర్వాత సినిమాను కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇందులో రవితేజ సరసన హీరోయిన్‌గా ఆషికాను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే కేవలం స్టార్స్ హీరోలనే ఆషికా రౌండప్ చేస్తుందనుకోవచ్చు.
Also Read – Electric Vehicles : గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఫ్రీ


