Sunday, September 8, 2024
Homeచిత్ర ప్రభAshu Reddy: ఆర్జీవీతో అషు అరాచకం.. పాపం.. ఈసారైనా వర్క్ అవుట్ అవుతుందా?

Ashu Reddy: ఆర్జీవీతో అషు అరాచకం.. పాపం.. ఈసారైనా వర్క్ అవుట్ అవుతుందా?

Ashu Reddy: అషు రెడ్డి.. కెమెరా ముందు ఏదో సాధించాలని అమెరికా నుండి హైదరాబాద్ లో దిగిపోయిన ఈ అమ్మడికి మొదట్లో జూనియర్ సమంతగా మంచి మార్కులే పడ్డాయి. ఇక నటన సంగతి అంటావా?.. ఏదైనా గట్టి ఛాన్స్ దక్కితేనే కదా తెలిసేది. కానీ.. ఆ క్యారెక్టరే అషూకి ఇప్పటి వరకు పడలేదు. అషూ కూడా అలా యాక్టింగ్ స్కోప్ ఉండే పాత్ర కన్నా.. షార్ట్ కట్ లో స్టార్ అయిపోవాలని.. తనకున్న అందాన్ని ఆయుధంగా చేసి స్కిన్ షోకి తెరలేపింది.

- Advertisement -

అషు ఎక్కడ ఉన్నా.. ఏ షో చేసినా అందాల ప్రదర్శనకొచ్చిన లోటేమీ ఉండదు. ఇది మొదట్లో బాగానే ఉన్నా.. ఆ తర్వాత అది కూడా ప్రేక్షకులకు మొహం కొట్టేసింది. దీంతో ఇంకా ఇంకా స్కిన్ షో పెంచేస్తున్న అషు బ్రేక్ త్రూ కోసం అప్పుడప్పుడు బోల్డ్ ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. రాత్రికి రాత్రి సాధారణ అమ్మాయిని స్టార్ చేసేయగల సత్తా రామ్ గోపాల్ వర్మది. ఒకప్పుడు సక్సెస్ సినిమాలతో స్టార్స్ ను తయారుచేసిన వర్మ.. ఇప్పుడు తనదైన ఇంటర్వ్యూలలో స్టార్స్ ను చేసేస్తున్నాడు.

ఆ మధ్య ఒక్క ఇంటర్వూతో అరియనా అనే యాంకర్ స్టార్ యాంకర్ గా మారడం.. అక్కడ నుండి బిగ్ బాస్ ఇంట్లోకి.. ఇలా ఇప్పుడు ఏ ఈవెంట్ లో చూసినా అరియనానే కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అషు రెడ్డి కూడా అదే బాటలో గతంలోనే అదే ఆర్జీవీతో ఓ కేఫ్ లో ఇంటర్వ్యూ నిర్వహించారు. అరియనా ఇంటర్వ్యూకి మించి అషు బోల్డ్ నెస్ చూపించినా అది ఏ మాత్రం అషుకి ఉపయోగపడలేదు. కానీ.. ఈసారి మళ్ళీ మరోసారి అంతకు మించి బోల్డ్ ఇంటర్వ్యూతో వచ్చారు అషు.. ఆర్జీవీ.

డేంజరస్ మా ఇష్టం పేరుతో ఓ లెస్బియన్ మూవీ తెరకెక్కించిన వర్మ చాలాకాలంగా ఈ సినిమా రిలీజ్ కోసం తంటాలు పడుతున్నాడు. ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమాను అతిత్వరలో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో తనదైన స్టైల్ డిఫరెంట్ ప్రమోషన్స్ చేపట్టాడు. అందులో భాగంగానే అషుకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. డేంజరస్ సినిమా కన్నా ఈ ఇంటర్వ్యూనే డేంజరస్ కావాలని అషు, ఆర్జీవీ ఫిక్స్ అయి ఈ ఇంటర్వ్యూ తెచ్చినట్లున్నారు.

ఇందులో ఆర్జీవీ అషు కాళ్ళ దగ్గర కూర్చొని.. కాళ్ళకి ముద్దులు పెట్టడం, కాళ్ళని నాలుకతో టచ్ చేయడం.. ఇలా చేయాల్సిన అన్ని అరాచకాలు చేశారు. డబుల్ డేంజరస్ అని పేరు పెట్టేసిన ఈ ఇంటర్వూలో అషు మాటలతోనే రెచ్చగొడుతుంటే.. ఆర్జీవీ మందు తాగుతూ అషు అందాన్ని కళ్ళతోనే జుర్రేసుకున్నాడు. అషు హుక్కా తాగుతూ టెంప్ట్ చేస్తుంటే.. ఆర్జీవీ డబుల్ మీనింగ్ మాటలతోనే తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. ఫైనల్ గా ఈ ఇంటర్వ్యూ వలన వర్మ సినిమా అయితే ఎంతోకొంత జనాలలోకి వెళ్ళింది. మరి అషుకి ఎంతవరకు ఉపయోగపడిందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News