Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAugust 2025 Movies: ఆగస్టు సినీ జాతర.. బాక్సాఫీస్‌ రచ్చ రచ్చే!

August 2025 Movies: ఆగస్టు సినీ జాతర.. బాక్సాఫీస్‌ రచ్చ రచ్చే!

August 2025 BoxOffice Release Movies: ఆగస్టు వచ్చేసింది. పండగలు, వీకెండ్‌లతో కలిసి బాక్సాఫీస్‌కు సందడి తెచ్చింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు ఈ నెలలో విడుదల కానున్నాయి. యాక్షన్, రొమాన్స్, కామెడీ, డ్రామా.. అన్నీ కలిసిన వైవిధ్యమైన చిత్రాలు థియేటర్‌లలో సందడి చేయనున్నాయి. మరి, ఈ నెలలో ఏ సినిమాలు, ఎప్పుడు వస్తున్నాయో చూద్దాం!

- Advertisement -

మొదటి వారం : వైవిధ్యమైన వినోదం

కింగ్డమ్ (జులై 31) : విజయ్ దేవరకొండ నటన, గౌతమ్ టేకింగ్‌తో ఈ చిత్రం థియేటర్‌లలో సందడి చేస్తోంది. యాక్షన్‌తో కూడిన ఈ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

సార్‌.. మేడమ్‌ (ఆగస్టు 1) : విజయ్ సేతుపతి, నిత్యామేనన్ జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హృదయాన్ని హత్తుకునే కథతో వచ్చేసింది.

థాంక్యూ డియర్‌ (ఆగస్టు 1) : ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా నటించిన ఈ చిత్రాన్ని తోట శ్రీకాంత్ కుమార్ రూపొందించారు. భావోద్వేగ కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది.

ఉసురే (ఆగస్టు 1) : టీజై అరుణాచలం, జననీ కునశీలన్ నటించిన ఈ చిత్రాన్ని నవీన్ డి గోపాల్ తెరకెక్కించారు. రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా విడుదలైంది.

ధడక్‌ 2 (ఆగస్టు 1, హిందీ) : సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి దిమ్రీ నటించిన రొమాంటిక్ డ్రామా. షాజియా ఇక్బాల్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

సన్నాఫ్‌ సర్దార్‌ 2 (ఆగస్టు 1, హిందీ) : అజయ్ దేవ్‌గణ్, మృణాళ్ ఠాకూర్ నటించిన యాక్షన్ డ్రామా. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం థియేటర్‌లలో సందడి చేస్తోంది.

Also Read: https://teluguprabha.net/cinema-news/tollywood-writer-bvs-ravi-interesting-comments-on-differences-between-balakrishna-and-jr-ntr/

రెండో వారం : చిన్న చిత్రాల సందడి

బకాసుర రెస్టారెంట్‌ (ఆగస్టు 8) : కమెడియన్ ప్రవీణ్, వైవా హర్ష నటించిన కామెడీ చిత్రం. శివ దర్శకత్వంలో ఈ సినిమా వినోదాన్ని పంచనుంది.

హీర్‌ ఎక్స్‌ ప్రెస్‌ (ఆగస్టు 8, హిందీ) : ఉమేశ్ శుక్లా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భావోద్వేగ కథాంశంతో వస్తోంది.

అందాజ్‌ 2 (ఆగస్టు 8, హిందీ) : సునీల్ దర్శన్ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా విడుదల కానుంది.

అతడు (ఆగస్టు 9, రీ-రిలీజ్) : మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ ఆల్‌టైమ్ ఎంటర్‌టైనర్ 4Kలో రీ-రిలీజ్ కానుంది.

స్వాతంత్ర దినోత్సవ సందడి : భారీ చిత్రాలు

కూలీ (ఆగస్టు 14) : రజనీకాంత్ నటించిన ఈ భారీ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించారు. నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్, డ్రామాతో ఈ సినిమా భారీ అంచనాలతో వస్తోంది.

వార్‌ 2 (ఆగస్టు 14) : హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను అయాన్ ముఖర్జీ రూపొందించారు. కియారా అడ్వాణీ కథానాయిక. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

నాలుగో వారం : భావోద్వేగం, వినోదం

పరదా (ఆగస్టు 22) : అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వినోదంతో పాటు లోతైన భావోద్వేగ కథనంతో వస్తోంది. దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మేఘాలు చెప్పిన ప్రేమకథ (ఆగస్టు 22) : నరేశ్ అగస్త్య, రబియా ఖాతూన్ నటించిన ఈ రొమాంటిక్ డ్రామాను విపిన్ రూపొందించారు. రాధికా శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు.

Also Read:https://teluguprabha.net/cinema-news/actress-radhika-sarathkumar-diagnosed-with-dengue-under-treatment/

నెలాఖరు : భారీ అంచనాలు

మాస్‌ జాతర (ఆగస్టు 27) : రవితేజ 75వ చిత్రాన్ని భాను భోగవరపు దర్శకత్వంలో సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. వినాయక చవితి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

సుందరకాండ (ఆగస్టు 27) : నారా రోహిత్ నటించిన ఈ చిత్రాన్ని వెంకటేశ్ నిమ్మలపూడి రూపొందించారు. వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌కుమార్ కథానాయికలు.

పరమ్‌ సుందరి (ఆగస్టు 29, హిందీ) : జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన రొమాంటిక్ డ్రామా. తుషార్ జలోటా దర్శకత్వంలో ఈ చిత్రం ఉత్తర, దక్షిణ భారత సంస్కృతుల మధ్య ప్రేమకథగా రూపొందింది.

రివాల్వర్‌ రీటా (ఆగస్టు 29) : కీర్తి సురేశ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్‌ను కె.చంద్రు రూపొందించారు. కామెడీ, యాక్షన్‌తో ఈ సినిమా అలరిస్తుంది. రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad