Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభAvatar 2: కొత్త ట్రైలర్.. అండర్ వాటర్ ఫైట్స్.. మరో కొత్త ప్రపంచం గురూ!

Avatar 2: కొత్త ట్రైలర్.. అండర్ వాటర్ ఫైట్స్.. మరో కొత్త ప్రపంచం గురూ!

Avatar 2: హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామరూన్ అద్భుత సృష్టి అవతార్. 2009లో ‘అవతార్’ అనే కొత్త సినీ ప్రపంచాన్ని వరల్డ్ సినిమా ఫ్యాన్స్‌కు పరిచయం అయింది. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ‘అవతార్’ కలెక్షన్ల సునామీ సృష్టించగా.. ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఇప్పటికీ ఆల్ టైమ్ రికార్డు అవతార్ సొంతం. ఇప్పటి వరకు ఈ సినిమాను కొట్టే సినిమా రాకపోగా ఇప్పుడు దీనికి సీక్వెల్ సిద్ధమైంది.

- Advertisement -

ఈ డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లో ‘అవతార్ 2’ విడుదలవుతోంది. పార్ట్-2కు ది వే ఆఫ్ వాటర్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన దర్శకుడు.. ఇప్పటికే ఒక ట్రైలర్ రిలీజ్ చేయగా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలను పెంచేస్తే.. తాజాగా మరో ట్రయిలర్ రిలీజ్ చేశారు. ఈసారి త్రీడీ అనుభూతిని అందించే విధంగా ట్రయిలర్ కట్ చేశాడు. తాజా ట్రయిలర్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

ఇప్పుడు రిలీజైన ఈ రెండో ట్రయిలర్.. ఒక్క ఫ్రేమ్ కూడా మిస్ చేయడానికి వీల్లేదు అనేంతలా కట్టిపడేసింది. అవతార్‌’తో ప్రేక్షకుల్ని పాండోరా గ్రహంలో విహరింపజేసిన జేమ్స్‌ కామెరూన్‌.. ఇప్పుడు ‘అవతార్‌ 2’తో మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. సముద్ర గర్భంలోని మరో కొత్త లోకంలో కళ్లు మిరిమిట్లు గొలిపే హంగులతో, ఆశ్చర్యానికి గురిచేసే విజువల్ ఎఫెక్ట్స్‌తో ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ ట్రైలర్ కట్టిపడేస్తోంది. ఇప్పటికే ఈ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో రికార్డుల మోత మొదలైపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News