SSMB29: ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత మహేష్‌బాబుతో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. మహేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్‌గా ఉన్న తెలుగు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్‌బాబు, రాజమౌళి కలయికలో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇదే కావడం గమనార్హం.
జనవరిలో లాంఛ్…
ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో అఫీషియల్‌గా ఈ ఏడాది జనవరిలో ఈ మూవీ మొదలుపెట్టారు రాజమౌళి. ఎనిమిది నెలలు అవుతున్నా ఇప్పటివరకు స్టోరీ, జానర్‌తో పాటు మహేష్‌బాబు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఈ సినిమాకు పనిచేస్తున్న నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు బయటకు రాకుండా సీక్రెట్ మెయింటేన్‌చేస్తూ అభిమానుల్లో సినిమా పట్ల ఉన్న హైప్‌ను పెంచుతున్నారు రాజమౌళి.
నవంబర్‌లో ఫస్ట్ లుక్…
మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబీ 29 నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రివీలవుతుందని ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. నవంబర్‌లో ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ రిలీజ్ చేస్తామని రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ సినిమాను గ్లోబల్ ట్రాట్ అంటూ పేర్కొన్నారు.
అవతార్ డైరెక్టర్…
హలీవుడ్ లెజెండరీ డైరెక్టర్, అవతార్ ఫేమ్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేయించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ పార్ట్ 3 ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం జేమ్స్ కామెరూన్ నవంబర్‌లో ఇండియా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమోషన్స్ టైమ్‌లోనే ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ లుక్‌ను కామెరూన్ ఆవిష్కరిస్తారని అంటున్నారు. రాజమౌళి ప్లాన్ అనుకున్నట్లుగా జరిగితే గ్లోబల్ ట్రాట్ క్రేజ్ హాలీవుడ్ రేంజ్‌కు చేరడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్ లుక్‌తో అంచనాలు అమాంతం ఆకాశాన్ని అంటడం ఖాయమని పేర్కొన్నారు.
Also Read- Comedian Ramachandra: పక్షవాతంతో పోరాడుతున్న టాలీవుడ్ కమెడియన్.. సాయం కోసం ఎదురు చూపులు
త్వరలో మూడో షెడ్యూల్…
ఎస్ఎస్ఎంబీ 29కు సంబంధించి ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి టాంజానియా, కెన్యాలలో మూడో షెడ్యూల్‌ను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే మహేష్‌బాబు ఆఫ్రికా వెళ్లారు. ఈ గ్లోబల్ ట్రాట్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.


