Avatar 3 First Look Out: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా సినీ లవర్స్‌లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్’ మూవీ ప్రపంచ సినీ చరిత్రలోనే ఓ సంచలనం అని చెప్పాలి. పార్ట్ 1 లో పండోర అనే గ్రహాన్ని తయారు చేసి దానిలోని ప్రకృతి అందాలను అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్‌తో సినీ ప్రేమికులను కట్టిపడేశారు జేమ్స్. ఆ తర్వాత పార్ట్ 2 గా వచ్చిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మూవీతో మరో సంచలనం సృష్టించారు. అవతార్ 3 ఇంకెలాంటి కాన్సెప్ట్‌తో రూపొందనుందనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.
ఈ క్రమంలో తాజాగా ‘అవతార్’ సీక్వెల్ లో మూడో భాగంగా ‘అవతార్- ఫైర్ అండ్ యాష్’ మూవీని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సీక్వెల్ కి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. అవతార్ ప్రాంఛైజ్ లో వస్తున్న సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడో భాగం ‘అవతార్- ఫైర్ అండ్ యాష్’ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేయగా దీనికి వేశేషమైన స్పందన లభిస్తోంది. అంతేకాదు, ఈ జులై 25న ఫస్ట్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చారు.
Also Read – Oppo K13 Turbo Series: ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయ్..
అవతార్ 3 లుక్ విషయానికి వస్తే.. బ్రిటీష్ నటి ఊనా చాప్లిన్ పోషించిన వంగర్ అనే పాత్రకు సంబంధించిన లుక్ ఇది కావటం విశేషం. అవతార్ వన్ లో భూమిపై జరిగే పోరాటాన్ని చూపించిన జేమ్స్ కామెరూన్, అవతార్ 2లో నీటిలో జరిగే పోరుని చూపించారు. అవతార్ 3 విషయానికి వస్తే పంచ భూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందుతోంది.
ఇక ‘అవతార్- ఫైర్ అండ్ యాష్’ 2025 డిసెంబర్ 19న అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట అరవై భాషలలో రిలీజ్ కాబోతుండటం గొప్ప విశేషం. పార్ట్2 గా వచ్చిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’లో ‘కేట్ విన్స్‌లెట్’ చేసిన రోనాల్ క్యారెక్టర్ ని అవతార్ 3లో ఇంకా ఆసక్తికరంగా మలిచినట్టుగా మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఈ మూవీలో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని తెలిపారు. ఈ పాత్ర కోసం ‘కేట్ విన్స్‌లెట్’ ఎన్నోరోజులు కష్టపడి శిక్షణ తీసుకున్నట్లుగా కూడా వెల్లడించారు. ఇక అవతార్ ఫ్రాంచైజీలో రూపొందించబోయే ‘అవతార్ 4’ 2029 లో, ‘అవతార్ 5’ డిసెంబరు 2031లో విడుదల చేస్తామని మేకర్స్ ఆల్రెడీ అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.
Also read – Lord Shiva: శ్రావణ మాసంలో ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టిస్తున్నారా? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..


