Avika Gor: స్మాల్ స్క్రీన్ మీద ‘చిన్నారి పెళ్లికూతురు’ గా డైలీ సీరియల్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది అవికా గోర్. ఈ సీరియల్ ద్వారా వచ్చిన క్రేజ్ తో తెలుగులో వచ్చిన ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ కి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాతో వచ్చిన పాపులారిటీ అవికా గోర్ కి వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది.
అవికా గోర్ సినిమా చూపిస్త మావా, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజు గారి గది-3, ఎక్కడికి పోతావు చిన్నవాడా, పాప్ కార్న్, ఉమాపతి లాంటి సినిమాలలో నటించింది. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది. అయితే గత కొంతకాలంగా హీరోయిన్ అవకాశాలు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి చేసుకోబోతున్నట్టుగా అవికా గోర్ ప్రకటించింది. గత కొంతకాలంగా అవికా గోర్ సామాజిక వేత్త అయిన మిలింద్ చంద్వానీతో ప్రేమలో ఉంది. వీళ్ళిద్దరికీ ఈ ఏడాది జూన్ లో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇక రీసెంట్ గా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించిన తేదీని ప్రకటించింది.
Also Read – Bathukamma: నేడు ముద్దపప్పు బతుకమ్మ.. ఈ రోజు గౌరమ్మకు నైవేద్యం ఇదే.!
అవికా గోర్ ఈ ఇంటర్వ్యూలో “మేమిద్దరం సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకోబోతున్నాం” అంటూ తేదీని ప్రకటించింది. అంతేకాదు, “నాకు ఎప్పుడూ ప్రోత్సాహాన్ని ఇస్తూ అన్నివేళలా నాతో ఉండే భాగస్వామిని పొందినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను ఎంతో అదృష్టవంతుడిని పెళ్లి చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను”.. అంటూ అవికా తెలిపింది. ఇక అవికా తన పెళ్లి తేదీని ప్రకటించిన సమయంలో పక్కనే ఉన్న ఆమె తల్లి బాగా ఎమోషనలయింది. ఇదే సమయంలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ..” 2008 నుండి నన్ను ప్రేక్షకులు గుర్తించదగ్గ స్థాయిలో ఉన్నాను.
నా సినిమాలు చూసి ఎంతగానో ఎంకరేజ్ చేశారు. అన్ని వేళలా నాకు వారు ఎంతో సపోర్ట్ చేశారు. అందుకే, వాళ్లు కూడా నా వివాహ బంధంలో భాగం కావాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పాను. అలాగే, చిన్నతనం నుంచే నేను.. నా పెళ్లి విషయంలో ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు, ఈ కొత్త అధ్యాయంతో నా చిన్నప్పటి కల నెరవేరబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది”.. అంటూ అవికా గోర్ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. మరి, ఇంత చిన్న వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న అవికా గోర్ పెళ్లి తర్వాత సినిమాలలో నటిస్తుందా లేదా అనే విషయాన్ని మాత్రం తెలుపలేదు.
Also Read – CM Revanth: నేడు మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి.. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన!


