Saturday, November 15, 2025
HomeTop StoriesPuri Sethupathi: అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

Puri Sethupathi: అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

Puri Sethupathi: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ హిట్ అందుకొని చాలాకాలం అయింది. మధ్యలో రామ్ పోతినేని హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమాను తీసి భారీ కమర్షియల్ హిట్ కొట్టారు. కానీ, మళ్ళీ వరుసగా ఫ్లాపులతో సతమతమవుతున్నారు. విజయ్ దేవరకొండతో చేసిన పాన్ ఇండియా సినిమా లైగర్ భారీ అంచనాల మధ్య వచ్చి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ గా మొదలైన జనగనమణ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది.

- Advertisement -

ఈ సినిమాను పూరి.. విజయ్ తోనే మొదలు పెట్టాడు. కానీ, లైగర్ ఇచ్చిన షాక్ తో జనగనమణని పక్కన పెట్టి, తనకి మంచి కంబ్యాక్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ని తీశాడు. కాంబినేషన్ మొత్తం రిపీటవడంతో ఈ సీక్వెల్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే కలెక్షన్స్ ని రాబట్టి, పూరిని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకున్నారు. కానీ, డబుల్ ఇస్మార్ట్ కూడా పూరి బృందానికి డబుల్ షాక్ ఇచ్చింది. దీంతో పూరి చాలా సమయం తీసుకొని కొత్త సినిమాను పట్టాలెక్కించాడు.

Also Read – Pranavi Manukonda: హాట్ ఫోటోషూట్ తో రెచ్చగొడుతున్న హైదరాబాద్ అమ్మాయి

ఆ సినిమానే, విజయ్ సేతుపతితో చేస్తున్న (బెగ్గర్) ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ గా ప్రచారంలో ఉన్న మూవీ. ఇందులో హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ సంయుక్త మేనన్ ఎంపిక కాగా, కీలక పాత్రల కోసం పూరి సీనియర్ నటి టబు, దునియా విజయ్ లని ఎంచుకున్నారు. ఇక పూరి జగన్నాధ్ సినిమాలకి సాంగ్స్ చాలా హైలెట్ గా ఉంటాయి. మ్యూజిక్ పరంగా ఆల్బం సూపర్ హిట్ అవుతుంది. సందీప్ చౌతా లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తో పూరి సూపర్ లాంటి సినిమా చేసిన సంగతి తెలిసిందే. చక్రి, మణిశర్మ లాంటి వారు పూరితో పనిచేశారు.

ఇక తాజా చిత్రానికి పూరి ఓ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ని ఎంచుకున్నారు. ఆయనెవరో కాదు.. అర్జున్ రెడ్డి, అనిమల్ చిత్రాలకి సంగీతం అందించిన హర్ష వర్ధన్ రామేశ్వర్ ని పూరి ఎంచుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేస్తూ సోషల్ మీడియాలో పిక్ ని షేర్ చేసుకున్నారు. హర్ష మధ్యలో అటు చార్మి, ఇటు పూరి కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్న పిక్ అది. విజయ్ సేతుపతిని ఎంచుకోవడం ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ అయితే, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌గా హర్ష వర్ధన్ రామేశ్వర్ ని ఎంచుకోవడం మరో లెవల్ ఇంట్రస్టింగ్ న్యూస్ అని చెప్పాలి. ఆయన రాకతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

Also Read – Dude Trailer: డ్యూడ్ ట్రైల‌ర్ టాక్‌ – అద‌ర‌గొట్టిన ప్ర‌దీప్‌ – డీజే టిల్లు బ్యూటీ స‌ర్‌ప్రైజ్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad