Mass Jathara: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు కొద్దిగా నిరాశ కలిగించే వార్త! ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వస్తున్న రవితేజ మూవీ ‘మాస్ జాతర’ విడుదల తేదీ మరోసారి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట దసరా సందర్భంగా ప్రచారం మొదలుపెట్టి, అక్టోబర్ 31న సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు, అదే రోజున మరో పెద్ద సినిమా రీ-రిలీజ్ అవుతుండటంతో, ‘మాస్ జాతర’ మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని తాజా సమాచారం.
వాయిదాకు కారణం ‘బాహుబలి ది ఎపిక్’
రవితేజ సినిమా వాయిదాకు ప్రధాన కారణం.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘బాహుబలి’. ఆ సినిమాలోని రెండు భాగాలను కలిపి, ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తున్నారు.
ఈ ‘ఎపిక్’ వెర్షన్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని వాళ్ళ రవితేజ ‘మాస్ జాతర’కు ఓపెనింగ్స్ పరంగా నష్టం కలగవచ్చు అని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/chiranjeevi-personality-rights-court-ban-on-using-name-photo/
నవంబర్ 1న విడుదల ప్రీమియర్ షోలతో ప్లాన్
అందుకే, ఈ పోటీని తప్పించుకునేందుకు ‘మాస్ జాతర’ విడుదల తేదీని కేవలం ఒక్క రోజు ముందుకు జరిపినట్లుగా టాక్ నడుస్తోంది. అక్టోబర్ 31న విడుదల చేయాల్సిన ఈ సినిమాను ఇప్పుడు నవంబర్ 1న థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట.
అయితే, ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచడానికి, అక్టోబర్ 31 కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్ షోలు వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. దీనివల్ల తొలి రోజు టాక్ ప్రేక్షకులకు తొందరగా తెలిసి, నవంబర్ 1న మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.


