Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRavi Teja: కొత్త సినిమాలకు కష్టాలు, 'బాహుబలి'దే పైచేయి

Ravi Teja: కొత్త సినిమాలకు కష్టాలు, ‘బాహుబలి’దే పైచేయి

Mass Jathara: టాలీవుడ్‌లో ఇటీవల మొదలైన రీ రిలీజ్ ట్రెండ్… కొత్తగా విడుదలవుతున్న సినిమాలకు పెద్ద తలనొప్పిగా మారింది. స్టార్ హీరోల పాత హిట్ ప్లాప్ సినిమాలు కూడా 4కే క్వాలిటీతో మళ్లీ థియేటర్లలోకి వస్తుంటే, అభిమానులు పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది ఒకరకంగా చిత్ర పరిశ్రమకు డబ్బు తీసుకొస్తున్నా, చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలపై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా, రీ రిలీజ్‌లు కూడా కొత్త సినిమాలతో పోటీగా శుక్రవారం వస్తుండటం నిర్మాతలకు కన్నీళ్లు తెప్పిస్తోంది.

- Advertisement -

ALSO READ: https://teluguprabha.net/cinema-news/kamal-haasan-rajinikanth-nelson-new-movie-update/

బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘భైరవం’ సినిమా విడుదలైన సమయంలోనే, మహేష్ బాబు ‘ఖలేజా’ రీ రిలీజ్‌కు భారీ ఓపెనింగ్స్, కలెక్షన్లు వచ్చాయి. దీని ప్రభావంతో తమ సినిమాకు రావాల్సిన వసూళ్లు తగ్గాయని ” నిర్మాతలు బాధపడ్డారు.
ఈ విషయంలో మంచు మనోజ్ కూడా గట్టిగా మాట్లాడాడు . “ఒక తెలుగు సినిమాను మరో తెలుగు సినిమాతో చంపేయడం సరైనది కాదు” అని ఆవేదన వ్యక్తం చేశాడు. రీ రిలీజ్ చిత్రాలను శుక్రవారం కాకుండా వీక్ డేస్ లో విడుదల చేస్తే, కొత్త సినిమాలకు కొంత ఊరట ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు ‘బాహుబలి’ ముందు ‘మాస్ జాతర’

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘మాస్ జాతర’ సినిమాను అక్టోబర్ 31న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, అదే రోజున దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి ది ఎపిక్’ రెండు భాగాలను కలిపి కొన్ని కొత్త సీన్స్‌తో రీ రిలీజ్ అవుతోంది. ‘బాహుబలి ది ఎపిక్’ కోసం అడ్వాన్స్ బుకింగ్‌లు ఊహించని విధంగా పెరుగుతుండటంతో, రవితేజ సినిమాకు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అని ఆందోళన. అంతేకాదు, ప్రేక్షకుల దృష్టి కూడా ‘బాహుబలి’ వైపు మళ్లింది. ఈ కారణంగా, ఇప్పటికే మూడు, నాలుగు సార్లు వాయిదా పడిన ‘మాస్ జాతర’ సినిమా మరోసారి వెనక్కి వెళ్లి, నవంబర్ 1కి పోస్ట్‌పోన్ అవుతుంది అనే ప్రచారం మొదలైంది. ఇది రవితేజ అభిమానులకు, సినిమా నిర్మాతలకు కొంత బాధ కలిగించే విషయమే.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/kumari-22f-sukumar-wife-tabitha-produces-sequel/

స్టార్ హీరోల పాత సినిమాలు రీ రిలీజ్ కావడం అభిమానులకు ఆనందమే. కానీ, థియేటర్ల షేరింగ్ విషయంలో, విడుదల తేదీల విషయంలో సరైన ప్రణాళిక లేకపోతే… మంచి కంటెంట్‌తో వస్తున్న కొత్త సినిమాలు కచ్చితంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో సినీ పెద్దలు వెంటనే దృష్టి పెట్టాలని సినీ వర్గాలు కోరుతున్నాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad