Saturday, November 15, 2025
HomeTop StoriesBaahubali - The Epic: ప్రభాస్ లేటెస్ట్ లుక్ వైరల్

Baahubali – The Epic: ప్రభాస్ లేటెస్ట్ లుక్ వైరల్

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన బాహుబలి మూవీస్ టాలీవుడ్ సినిమాను ఏ స్థాయిలో నిలబెట్టాయో అందరికీ తెలిసిందే. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ లాంటి వారు కీలక పాత్రల్లో నటించిన ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ మన తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టాయి. దీంతో రాజమౌళి దర్శకుడిగా.. ప్రభాస్-రానా స్టార్లుగా పాన్ ఇండియా క్రేజ్‌ని దక్కించుకున్నారు.

- Advertisement -

అయితే, ఈ ఫ్రాంఛైజీస్ ని కలిపి ఇప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే సినిమాగా ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవల ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ వచ్చి ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని పెంచేసింది. ముఖ్యంగా, అప్పటికంటే ఇప్పుడు రాబోతున్న ‘బాహుబలి: ది ఎపిక్’ క్వాలిటీ అద్భుతంగా ఉంది. ఇక, ఈ మూవీలో ఒరిజినల్స్‌లో లేని కొన్ని సీన్స్‌ని అదనంగా జత చేసినట్టుగా కూడా చెప్పుకుంటున్నారు. ‘బాహుబలి’ రెండు భాగాలు రిలీజ్ చేయడానికి ముందు జక్కన్న టీమ్ వదిలిన మేకింగ్ వీడియోలు భారీ అంచనాలను పెంచాయి.

Also Read: https://teluguprabha.net/cinema-news/mega-heroes-coming-with-back-to-back-movies-in-2026/

అయితే, ఆల్రెడీ చూసేసిన ఈ రెండు భాగాలు కలిపి రిలీజ్ కాబోతున్నప్పటికీ.. ఓ కొత్త సినిమాకి ఉన్నంత క్రేజ్ ప్రేక్షకుల్లో కలగడం ఆసక్తికరం. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభాస్ ప్రత్యేకంగా ఓ స్పెషల్ బైట్‌ని ఇచ్చారు. ఇందులో ఆయన..”వాచ్ బాహుబలి ది ఎపిక్ కంబైండ్ కట్ ఆఫ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆన్ బిగ్ స్క్రీన్స్ ఆన్ అక్టోబర్ 31″ అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో బైట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

ముఖ్యంగా, ఈ వీడియో బైట్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్ అద్భుతంగా ఉందంటున్నారు ఫ్యాన్స్. ఈ మధ్య కాలంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాలలోని గెటప్ తప్ప స్పెషల్‌గా ఆయన లుక్ ఏదీ రాలేదు. ఇప్పుడీ లుక్ చూసి అందరూ “హ్యాండ్సం లుక్‌లో డార్లింగ్ సూపర్”.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ప్రభాస్ నుంచి మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజాసాబ్’, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ రాబోతున్నాయి. అలాగే, ఈ నవంబర్ నుంచి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సెట్స్‌పైకి రాబోతున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad