Baahubali The Epic: తెలుగు సినిమా స్థాయిని పెంచటమే కాదు.. బాక్సాఫీస్ రికార్డులకు సరికొత్త అర్థాన్ని చెప్పిన సినిమా ‘బాహుబలి’. మహేంద్ర బాహుబలి.. అమరేంద్ర బాహుబలిగా ద్విపాత్రాభినయం చేసిన ప్రభాస్, భల్లాలదేవుడిగా రానా, కట్టప్పగా సత్యరాజ్, రాజమాత శివగామిగా రమ్యకృష్ణ, దేవసేనగా అనుష్క శెట్టి, అవంతికగా తమన్నా.. ఇలా అందరూ జక్కన్న పాత్రలకు తమదైన నటనతో ప్రాణం పోశారు. అందుకనే సిల్వర్ స్క్రీన్‌పై మెమొరబుల్ సెల్యూలాయిడ్‌గా నిలిచిపోయింది. ఈ మూవీని రెండు భాగాలుగా తీసిన సంగతి తెలిసిందే. ఈ క్లాసిక్ మూవీని విడుదలైన పదేళ్లవుతుంది. ఇన్నేళ్లయినా ఇప్పటికీ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ క్రమంలో రాజమౌళి రెండు భాగాలను కలిపి ఓ భాగంగా చేసి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తుండటం విశేషం.
Also Read – Samantha: ‘మా ఇంటి బంగారం’ను షురూ చేసిన సమంత.. వీడియో ఆయనే ప్రధానాకర్షణ
ఈ పాన్ ఇండియా సినిమాను ప్రపంచమంతా చూసింది. అయినా కూడా ‘బాహుబలి ది ఎపిక్’ను చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారంటే సినిమాపై ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకు జరుగుతున్న ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఆ రేంజ్ ఉన్నాయి మరి. మహేష్ మూవీతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి సమయాన్ని వెచ్చించి మరి ‘బాహుబలి ది ఎపిక్’ను ప్రమోట్ చేయటానికి ముందుకు వచ్చారు. రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. నాటి బాహుబలిలో ముగ్గురుకి నచ్చిన సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నింటి గురించి మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పూర్తి వీడియో త్వరలోనే రిలీజ్ కానుంది.
‘బాహుబలి ది ఎపిక్’ అక్టోబర్ 31న రిలీజ్ అవుతోంది. ఆర్కా మీడియా బ్యానర్‌లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమాను నిర్మించారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించగా..కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. బాహుబలి తొలి భాగం రూ.600 కోట్లుకు పైగా వసూళ్లన రాబడితే, బాహుబలి 2 .. రూ.1810 కోట్లను రాబట్టింది. మరిప్పుడు బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
Also Read – Allu Arjun: AA22XA6 షూటింగ్‌లో జాయిన్ అయిన మృణాల్


