Saturday, November 15, 2025
HomeTop StoriesBAHUBALI THE EPIC: 'బాహుబలి ది ఎపిక్' క్లైమాక్స్ లో 'బాహుబలి 3'? ఫ్యాన్స్‌కు పండుగే!

BAHUBALI THE EPIC: ‘బాహుబలి ది ఎపిక్’ క్లైమాక్స్ లో ‘బాహుబలి 3’? ఫ్యాన్స్‌కు పండుగే!

BAHUBALI: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి’ ఫ్రాంఛైజ్ భారతీయ సినిమా స్థాయిని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఈ రెండు భాగాల విజువల్ వండర్‌ను కలిపి, సరికొత్త ఎడిటింగ్‌తో, మెరుగైన విజువల్స్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ విడుదల చేస్తున్నారు. ‘బాహుబలి: ది ఎపిక్’ అనేది కేవలం రెండు సినిమాలను కలిపి విడుదల చేయడం కాదు. రాజమౌళి తన టీమ్‌తో కలిసి ఈ ఫిల్మ్‌ను పూర్తిగా రీ-ఎడిట్ చేశారు. దాదాపు 3 గంటల 40 నిమిషాల నిడివితో, ఇది ఒకే సినిమా చూసిన అనుభూతిని ఇస్తుంది. ఈ కొత్త వెర్షన్‌లో కొన్ని పాత పాటలు, సీన్స్‌ను తొలగించి, కథనాన్ని మరింత పదునుగా మార్చారట.

- Advertisement -

ALSO READ: https://teluguprabha.net/cinema-news/samantha-re-entry-into-kollywood-after-3-years-with-simbu-vetrimaran-arasan/

బాహుబలి 3′ పుకార్లకు చెక్!

రీ-రిలీజ్ క్లైమాక్స్‌లో ‘బాహుబలి 3’ ప్రకటన ఉంటుందని కొన్ని రోజులుగా వచ్చిన పుకార్లకు నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా చెక్ పెట్టారు. “ఖచ్చితంగా బాహుబలి 3 ప్రకటన ఉండదు. దానికి ఇంకా చాలా పని ఉంది” అని ఆయన స్పష్టం చేశారు. అయితే, అసలు ట్విస్ట్ ఏంటంటే… “మేము మరొక సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. ఇది ‘బాహుబలి’ ఫేజ్ 2కి నాంది.” అంటూ ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-og-movie-collections/

నిర్మాత “బాహుబలి ప్రపంచం నుంచి చెప్పడానికి ఇంకా చాలా కథలు ఉన్నాయి… ఇది ఫేజ్ 2 ఆరంభం” అనడంతో, ఆ సర్ప్రైజ్ ‘బాహుబలి 3’ కాకపోయినా, ఈ ప్రపంచానికి సంబంధించిన కొత్త ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. శివగామి పాత్రపై రాసిన ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ నవల ఆధారంగా తీయబోయే వెబ్ సిరీస్ గురించి లేదా పూర్తిగా కొత్త ప్రీక్వెల్/ సిరీస్ లేదా సినిమా గురించి ప్రకటన ఉండవచ్చు.
మొత్తానికి, ‘బాహుబలి: ది ఎపిక్’ అంటే కేవలం రీ-రిలీజ్ కాదు, బాహుబలి సామ్రాజ్యం తదుపరి అడుగు కోసం వేస్తున్న ఫాలో-అప్ అస్త్రం అని చెప్పొచ్చు! అక్టోబర్ 31, 2025న రాబోయే ఆ ‘మరొక సర్ప్రైజ్’ ఏమిటో చూడాలంటే, థియేటర్‌కు వెళ్లాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad