Rajamouli: బాహుబలి.. భారతీయ సినిమా చరిత్రలో ఓ సంచలనం.. ఓ అద్భుతం. రాజమౌళి మాస్టర్ మైండ్, ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్ లాంటి నటీనటుల పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపాయి. ఇప్పుడు, అదే మ్యాజిక్‌ని బిగ్ స్క్రీన్‌పైకి మళ్ళీ తీసుకురాబోతున్నారు.. అదే ‘బాహుబలి ది ఎపిక్’. అది కూడా బాహుబలి రెండు భాగాలను కలిపి సింగిల్ వెర్షన్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు మేకర్స్.
షాకింగ్ రన్ టైమ్..
‘బాహుబలి ది ఎపిక్’ ఎడిషన్ మూవీపై ఆడియన్స్‌లో అంచనాలు, ఆసక్తి మామూలుగా లేవు. ఈ క్రమంలో, తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందరిలోనూ మరింత ఆసక్తిని పెంచేలా చేసింది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షోలో ‘బాహుబలి ది ఎపిక్’ రన్‌టైమ్‌ని ఏకంగా 5 గంటల 27 నిమిషాలు (327 నిమిషాలు) అని మెన్షన్ చేశారు. దీంతో ‘అయ్యో బాబోయ్, ఇంత రన్‌టైమా?!’ అని ప్రేక్షకులు ముందుగా షాకయ్యారు. ఒకవేళ ఇదే ఫైనల్ కట్ అయితే, ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే లాంగెస్ట్ ఫిలింగా నిలిచిపోవడం ఖాయం. అయితే, ఇది కేవలం ప్లేస్‌హోల్డర్ అయ్యుండొచ్చననే వార్తలుకూడా వినిపిస్తున్నాయి.
Also Read – Karimnagar: కరీంనగర్ రేకుర్తిలో ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో స్థానిక జనం..
థియేటర్‌లో ఎలా వర్కవుట్ అవుతుంది?
సాధారణంగా సినిమాలు రెండున్నర నుంచి మూడు గంటల మధ్యలో ఉంటాయి కదా? అలాంటిది దాదాపు ఐదున్నర గంటలంటే దాదాపు సగం రోజు అంటే ఎలా చూస్తారు అని చర్చలు మొదలయ్యాయి. ఈ లాంగ్ రన్‌టైమ్‌కి మల్టీపార్ట్ ఇంటర్వెల్స్, లేదంటే ఇంటరాక్టివ్ వెర్షన్, లేదా మధ్యలో బ్రేక్స్ ఇచ్చి ప్రదర్శించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా, బాహుబలి ఫ్యాన్స్ అయితే ఈ న్యూస్‌తో పండగ చేసుకుంటున్నారు. తమ ఫేవరెట్ మూవీని మరోసారి బిగ్ స్క్రీన్‌పై, అది కూడా ఒకే సిట్టింగ్‌లో చూసే అవకాశం రావడం అసలుసిసలైన ట్రీట్ గా వారు భావిస్తున్నారు.
ఈ స్పెషల్ ‘బాహుబలి ది ఎపిక్’ ట్రీట్ అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది. ఆల్రెడీ బుక్ మై షో పేజీలో 10 వేల మందికి పైగా ఆసక్తిని కనపరుస్తున్నామని ట్యాగ్ చేశారంటే, ఆడియన్స్‌లో ఈ సినిమాకి ఉన్న హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి బ్రాండ్, ప్రభాస్ క్రేజ్… ఈ కాంబినేషన్‌కి ఉన్న డిమాండ్ బట్టి చూస్తే, ‘బాహుబలి ది ఎపిక్’ థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.
Also Read – Air conditioners: అమెజాన్‌లో ఈ ఏసీలపై బంపర్ ఆఫర్లు..ఇప్పుడే కోనేయండి..


