Prabhas: ‘బాహుబలి’.. ఈ ఒక్క పేరు భారతీయ సినిమా స్థాయిని మార్చేసింది! దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి క్రియేట్ చేసిన మహాద్భుతం.. ఆ మహాద్భుతాన్ని మళ్లీ బిగ్ స్క్రీన్‌పై చూసే అద్భుతమైన అవకాశం రాబోతోంది.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే.. “ఇది రీ రిలీజా? లేక కొత్త సినిమానా?” అని డౌట్ వస్తుంది!
క్వాలిటీ అంటే ఇది!
సాధారణంగా రీ రిలీజ్ అంటే పాత ప్రింట్‌ను మళ్లీ వేస్తారు. కానీ ఇది అలా కాదు! ‘బాహుబలి 1’ మరియు ‘బాహుబలి 2’ రెండు భాగాలను కలిపి, సరికొత్తగా 4K క్వాలిటీలో, అద్భుతమైన డాల్బీ అట్మాస్ సౌండ్‌తో రీమాస్టర్ చేశారు. ట్రైలర్‌లో ఒక చిన్న షాట్ చూసినా, అప్పుడు మనం మిస్ అయిన ప్రతి డీటైల్ ఎంత క్రిస్పీగా, ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో అర్థమవుతుంది.
రెండు సినిమాలు.. ఒకే కథ
రాజమౌళి ఈ రెండు సినిమాలను కలిపి, ఫ్లో ఎక్కడా ఆగకుండా, ఒకే ఫ్లోలో వచ్చేలా స్పెషల్‌గా ఎడిట్ చేయించారు. ఈ 3 గంటల 44 నిమిషాల పర్‌ఫెక్ట్ ఎపిక్ వెర్షన్‌లో.. మాహిష్మతిని చూడబోతున్నారు. ‘బాహుబలి ది ఎపిక్’ కేవలం టైంపాస్ కోసం రీ-రిలీజ్ చేయడం లేదు. దీన్ని ఏకంగా IMAX, 4DX, డాల్బీ సినిమా వంటి అన్ని ప్రీమియం ఫార్మాట్లలో విడుదల చేస్తున్నారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న రాబోతుండగా, అప్పుడే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ రీ-రిలీజ్ రికార్డులన్నిటినీ బద్దలు కొట్టాయంటే దీని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు!


