Baahubali The Eternal War Teaser: అమరేంద్ర బాహుబలిని కట్టప్ప చంపేసినప్పుడు అభిమానులు ఎంతో బాధపడ్డారు. కానీ చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ ఏం చేసిందనే కథాంశంతో సినిమా వస్తే ఎలా ఉంటుంది. ప్రేక్షకులు ఎంతో ఎగ్జయిట్ అవుతారు. ఇప్పుడదే జరుగుతోంది. బాహుబలి ప్రపంచానికి కొనసాగింపుగా బాహుబలి 3 రానుంది. అయితే రెగ్యులర్ సినిమాగా కాకుండా యానిమేటెడ్ సినిమాగా రానుంది. బాహుబలి 3 సినిమాను ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’గా రూపొందిస్తున్నామని బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్ సమయంలో రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు చెప్పినట్లుగానే ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’కు సంబంధించిన టీజర్ వచ్చేసింది. సినిమా 2027లో రిలీజ్ కానుంది.
‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’లో ఏముంటుందనే ఆసక్తిని టీజర్‌తో క్రియేట్ చేశాడు దర్శకుడు ఇషాన్ శుక్లా. చనిపోయిన అమరేంద్ర బాహుబలి పాతాళలోకంలో శివ లింగం ముందు నాట్యం చేస్తుంటాడు. విషాధరుడు అనే రాక్షసుడితో ఇంద్రుడు యుద్ధం చేయటానికి వస్తాడు. అప్పుడు విషాధరుడికి సపోర్ట్‌గా అమరేంద్రుడు వచ్చి ఇంద్రుడితో యుద్ధం చేస్తాడు. అసలు అమరేంద్రుడికి, ఇంద్రుడికి మధ్య ఎందుకు గొడవొచ్చింది?. విషాధరుడు ఎవరు? అనే విషయాలు తెలియాలాంటే మాత్రం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ చూడాల్సిందే. ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’లో ఇది పార్ట్ 1గా రానుంది. మరింకా ఇందులో ఇంకెన్ని పార్ట్స్ వస్తాయో చూడాలి మరి.
Also Read- Raviteja: మెగాస్టార్ డైరెక్టర్‌తో మాస్ మహారాజా మూవీ – రూటు మార్చనున్న రవితేజ?
బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రాజమౌళి ఇప్పుడు ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’కు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రూ.120 కోట్ల బడ్జెట్‌తో యానిమేటెడ్ మూవీగా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సినిమాను నిర్మిస్తున్నారు. బాహుబలి రెండు భాగాలను పదేళ్ల తర్వాత బాహుబలి ది ఎపిక్ పేరుతో సింగిల్ పార్ట్‌గా ఎడిట్ చేసిన జక్కన్న అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రీ రిలీజ్‌లోనూ ఈ సినిమా అద్బుతమైన కలెక్షన్స్‌ను సాధిస్తుండటం విశేషం. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే మేకర్స్ బాహుబలి ప్రపంచం కొనసాగుతుందని, బాహుబలి 3గా బాహుబలి ది ఎటర్నల్ వస్తుందని చెప్పారు.
వారు చెప్పినట్లే బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా రావటానికి మాత్రం చాలా సమయమే పట్టేలా ఉంది. ఈ యానిమేటెడ్ బాహుబలి ఎలాంటి సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.
Also Read- Allu Arjun: అల్లు అర్జున్, అట్లీ సినిమా సంగీత దర్శకుడతనేనా..? బన్నీ లీక్‌లో ఏముంది?


