యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా, దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మజాకా’ (Mazaka). ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు.
సంక్రాంతి పండగను పురస్కరించుకుని చిత్ర బృందం విడుదల చేసిన టీజర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘బేబీ మా’ ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా జేమ్స్ లియోన్ ఆలపించారు.