Tuesday, July 15, 2025
Homeచిత్ర ప్రభBaby rocks at SIIMA: సైమాలో సత్తా చాటిన 'బేబీ'

Baby rocks at SIIMA: సైమాలో సత్తా చాటిన ‘బేబీ’

ఆనంద్ దేవరకొండ మూవీ..

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ “బేబి” టీమ్ మరో ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా దుబాయ్ లో జరిగిన సైమా 2024 అవార్డ్స్ లో బేబి సినిమా టీమ్ 4 అవార్డ్స్ అందుకున్నారు.

- Advertisement -

బేబి సినిమాలో ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చిన హీరో ఆనంద్ దేవరకొండ బెస్ట్ యాక్టర్ క్రిటిక్ గా,
వైష్ణవి చైతన్య బెస్ట్ యాక్ట్రెస్ గా, బెస్ట్ డైరెక్టర్ క్రిటిక్ గా సాయి రాజేష్, బెస్ట్ లిరిక్స్ విభాగంలో అనంత్ శ్రీరామ్ అవార్డ్స్ అందుకున్నారు.

క్లాసిక్ ఇమేజ్ తో పాటు కమర్షియల్ సక్సెస్ సాధించి 100 కోట్ల గ్రాసర్ గా నిలిచింది బేబి. గొప్ప సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్ తో పాటు అవార్డ్స్ కూడా దక్కుతాయని అనేందుకు బేబి సినిమా మంచి ఉదాహరణగా నిలుస్తోంది. ఈ సినిమాకు గామా, ఫిలింఫేర్ సహా జాతీయ, రాష్ట్ర స్థాయిలో పేరున్న పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ దక్కాయి. ఇప్పుడు సైమా వంటి ప్రెస్టీజియస్ అవార్డ్స్ లోనూ సత్తా చాటింది బేబి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News