OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) ఇటీవల వచ్చి ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. డిప్యూటీ సీఎం అయ్యాక వచ్చిన మొదటి సినిమా కావడం.. అది కూడా పవన్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉంటే, ఆ అంచనాలను కాస్త కూడా అందుకోలేకపోయింది. దాంతో ఇక అందరూ పవన్ కళ్యాణ్ నటించిన మరో చిత్రం ఓజీ కోసం ఎదురు చూస్తూ ఈ మూవీ పైనే ఆశలు పెట్టుకున్నారు. మూవీపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఓజీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఓజి (OG) చిత్రాన్ని సుజీత్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 25న పాన్ ఇండియా వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక కేవలం ఒక నెల మాత్రమే ఉండడంతో ఓజి టీం ప్రమోషన్స్ మొదలు పెట్టారు. దీనిలో భాగంగా ఇప్పటికే మొదటి పాటను రిలీజ్ చేయగా, వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ నుంచి కూడా మేకర్స్ సర్‌ప్రైజ్ ని ప్లాన్ చేశారు.
Also Read – South Heroines: ఫోకస్ అంతా వీరి పైనే!
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా, వినాయక చవితి రోజున పవన్, ప్రియాంక లపై తీసిన ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. మొదటి సాంగ్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న మేకర్స్ ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ కి ప్లాన్ చేయడంతో అభిమానుల్లో ఈ సాంగ్ ఎప్పుడొస్తుందా అని విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ రెండు సర్‌ప్రైజెస్ వచ్చే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఉస్తాద్ నుంచి అప్‌డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకే మేకర్స్ పవన్ బర్త్ డేకి అలాగే, వినాయక చవితికి రెండు సర్‌ప్రైజెస్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఒకరోజు మిస్ అయినా మరో రోజు మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి గ్యారెంటీగా సర్‌ప్రైజ్ ఉంటుందని వెయిట్ చేయవచ్చు.
Also Read – Anil Ambani : అనిల్ అంబానీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఈడీ తర్వాత సీబీఐ సోదాలు


