Baahubali Epic: ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి రీ రిలీజ్‌లోనూ రికార్డులు తిరగరాసింది. బాహుబలి రెండు భాగాలను కలిపి బాహుబలి ఎపిక్ పేరుతో మళ్లీ ఈ బ్లాక్‌బస్టర్ మూవీని థియేటర్లలోకి తీసుకొచ్చారు రాజమౌళి. అనౌన్స్‌మెంట్ నుంచే బాహుబలి ఎపిక్ మూవీపై టాలీవుడ్‌తో పాటు మిగిలిన భాషల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మూడు గంటల నలభై నిమిషాలకుపైగా రన్ టైమ్ కావడం, ప్రమోషన్స్‌లో ప్రభాస్, రాజమౌళితో పాటు రానా కూడా పాల్గొనడటంతో రీ రిలీజ్‌లోనూ బాక్సాఫీస్ వద్ద బాహుబలి ఎపిక్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.
అంచనాలకు తగ్గట్లుగానే తొలిరోజే బాహుబలి ఎపిక్ కలెక్షన్స్ వర్షం కురిపించింది. మొదటిరోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 10.40 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. రీ రిలీజ్ మూవీస్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న ఇండియన్ మూవీగా నిలిచింది. తెలుగులోనూ నంబర్ వన్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నది. దళపతి విజయ్ గిల్లీ మూవీ రీ రిలీజ్‌లో మొదటిరోజు పది కోట్ల కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. దళపతి విజయ్ మూవీ రికార్డును బాహుబలి ఎపిక్ దాటేసింది. తెలుగులో 8 కోట్లతో పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్ ఇన్నాళ్లు టాప్ ప్లేస్‌లో నిలిచింది. గబ్బర్‌సింగ్ రికార్డును కూడా బాహుబలి ఎపిక్ బ్రేక్ చేసింది.
తొలి రోజు బాహుబలి ఎపిక్ తెలుగు వెర్షన్‌కు తొమ్మిది కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హిందీలో కోటికిపైగా కలెక్షన్స్ వచ్చాయట. తమిళం, కన్నడంతో మంచి వసూళ్లనే దక్కించుకున్నట్లు చెబుతున్నారు. రిలీజ్ ముందు రోజు ప్రీమియర్స్ ద్వారా 5.25 కోట్ల వరకు వసూళ్లు దక్కించుకున్నది.
Also Read – Mass Jathara Review: ‘మాస్ జాతర’తో అయినా రవితేజ సక్సెస్ కొట్టాడా?
శని, ఆదివారాల్లో బాహుబలి ఎపిక్ హవా కొనసాగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. శనివారం నాటి కలెక్షన్స్‌తో యాభై కోట్ల మైలురాయిని టచ్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఏడాది రిలీజైన స్ట్రెయిట్ సినిమాల కంటే ఎక్కువగా బాహుబలి ఎపిక్ కలెక్షన్స్ దక్కించుకుంది.
బాహుబలి, బాహుబలి 2 హైలైట్ అయిన సీన్లతో బాహుబలి ఎపిక్ మూవీని రూపొందించారు రాజమౌళి. ప్రభాస్ ఎలివేషన్లు, యాక్షన్ సీన్లను హైలైట్ చేశారు. తమన్నా లవ్ స్టోరీతో పాటు చాలా సీన్లను కట్ చేసిన రాజమౌళి… వాయిస్ ఓవర్‌తో వాటిని కవర్ చేశాడు.
ప్రభాస్, అనుష్క, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన బాహుబలి ఎపిక్‌లో రానా విలన్‌గా కనిపించాడు. రమ్యకృష్ణ, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. బాహుబలి ఎపిక్‌కు సంబంధించి ఓ ఈవెంట్‌ను నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వేడుకలో రాజమౌళితో పాటు బాహుబలి టీమ్ పాల్గొననున్నట్లు సమాచారం.
Also Read – Keerthy Suresh: మళ్లీ బిజీ అవుతోన్న కీర్తి సురేష్ – బాలీవుడ్ మూవీలో ఛాన్స్!


