Tollywood Directors: ఇండస్ట్రీలో హిట్టుకే వాల్యూ ఎక్కువగా ఉంటుంది. సక్సెస్ కొట్టిన దర్శకులు, హీరోల చుట్టూనే ఇండస్ట్రీ మొత్తం తిరుగుతుంటుంది. ఒక్క హిట్టుతో ఓవర్‌నైట్‌లోనే స్టార్స్‌గా మారిన వారు సినీ పరిశ్రమలో చాలా మందే కనిపిస్తారు. ఫ్లాపులతో స్టార్స్ నుంచి జీరోగా మారినవాళ్లు ఉన్నారు. హీరోల కంటే దర్శకులపైనే సక్సెస్ ఫెయిల్యూర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓ దర్శకుడిగా హిట్టు పడితే అతడితో సినిమా చేసేందుకు హీరోలు రెడీ అవుతుంటారు. నిర్మాతలు అడ్వాన్స్‌లతో క్యూ కడతారు. సక్సెస్ అందుకున్న డైరెక్టర్స్‌కు సంబంధించి అతడి నెక్స్ట్ మూవీ… ఫలానా జానర్‌లో, ఫలానా హీరోతో అంటూ పుకార్లు షికారు చేస్తూనే ఉంటాయి. సక్సెస్‌లను అందుకున్న దర్శకులు అదే జోష్‌లో వెంటనే నెక్స్ట్ మూవీస్‌ను సెట్స్‌పైకి తీసుకొస్తుంటారు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో సీన్ రివర్స్‌గా కనిపిస్తుంది. సక్సెస్‌లు అందుకున్నా నెక్స్ట్ సినిమా కోసం ఏళ్లకు ఏళ్లు టైమ్ తీసుకుంటున్నారు డైరెక్టర్లు.
బలగం రిలీజై రెండేళ్లయినా…
బలగం మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు వేణు టిల్లు. కేవలం కోటి రూపాయల బడ్జెట్‌తో చిన్న సినిమాగా రూపొందిన బలగం 30 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. బలగం మూవీ రిలీజై రెండేళ్లు దాటింది. కానీ వేణు నెక్స్ట్ మూవీ మాత్రం ఇప్పటికీ మొదలవ్వలేదు. ఎల్లమ్మ పేరుతో వేణు ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. హీరోహీరోయిన్లు ఎవరు? షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడన్నది క్లారిటీ లేదు.
Also Read – Mythological Movies : పౌరాణికాల చుట్టూ తిరుగుతోన్న సినీ ఇండస్ట్రీ
వంద కోట్లు కొట్టినా…
నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ మూవీతో కెరీర్‌లోనే పెద్ద హిట్ అందుకున్నాడు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. సరిపోదా శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చి ఏడాది దాటినా తన నెక్స్ట్ మూవీపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు వివేక్ ఆత్రేయ. తండేల్ మూవీతో నాగచైతన్యకు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన చందూ మొండేటి నెక్స్ట్ మూవీకి సంబంధించి హీరోల డేట్స్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.
కమిటీ కుర్రాళ్లు… ఆయ్…
కమిటీ కుర్రాళ్లుతో యదు వంశీ, ఆయ్‌తో అంజి తొలి అడుగులోనే తమలో విషయం ఉందని నిరూపించుకున్నారు. డెబ్యూ మూవీతో హిట్టు కొట్టిన నెక్స్ట్ మూవీ ఛాన్స్ కోసం వీరు ఎదురుచూస్తూనే ఉన్నారు. వీరితో పాటు గత ఏడాది సుజీత్ – సందీప్ (క మూవీ), విజయ్ బిన్నీ (నా సామి రంగ), టిల్లు స్క్వేర్ (మల్లిక్ రామ్), శ్రీహర్ష (ఓం భీమ్ బుష్), నంద కిషోర్ ఈమని (35 చిన్న కథ కాదు) దర్శకులుగా సత్తా చాటారు. కానీ ఈ దర్శకులు నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ రానేలేదు.
కోర్ట్ అరవై కోట్లు…
హీరో నాని నిర్మాతగా వచ్చిన చిన్న సినిమా కోర్ట్ అంచనాలకు మించి పెద్ద విజయాన్ని సాధించింది. ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 60 కోట్ల కలెక్షన్స్ దక్కించుకుంది. ఈ సినిమాతో డైరెక్టర్‌గా రామ్ జగదీష్ ప్రతిభను చాటాడు. కోర్ట్ సక్సెస్‌తో కొత్త సినిమా ఏది మొదలు పెట్టలేదు రామ్ జగదీష్. సింగిల్‌తో హిట్టు అందుకున్న కార్తీక్ రాజుకు ఏ హీరో ఛాన్స్ ఇవ్వనట్లు సమాచారం. వీరే కాదు సక్సెస్ అందుకున్న మరికొందరు దర్శకులు కూడా నెక్స్ట్ మూవీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
Also Read – Chiranjeevi: అత్తగారి పాడె ఎత్తుకున్న మెగాస్టార్!


