Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభBalakrishna: అఖండ-2 వాయిదా పక్కానా.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!

Balakrishna: అఖండ-2 వాయిదా పక్కానా.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!

Balakrishna: ఈ ఏడాది పెద్ద సినిమాల సందడి లేదని నిరాశ పడుతున్న సినీ ప్రేక్షకులకు రాబోయే నాలుగు ఐదు నెలలు భారీ వినోదాన్ని పంచేలా ఉన్నాయి. టాలీవుడ్‌లోని టాప్ స్టార్లకు చెందిన పలు చిత్రాలు ఈ చివరి నెలల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా మరో 10 రోజుల్లో రాబోతుంది. ఇక ఆగస్టులో ‘వార్-2’, ‘కూలీ’ వంటి చిత్రాలు సందడి చేయనున్నాయి. సెప్టెంబరులో రెండు మూడు భారీ చిత్రాలు షెడ్యూల్ అయి ఉన్నప్పటికీ, వాటిలో ‘ఓజీ’ (OG) మాత్రమే చెప్పిన డేట్‌కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, సెప్టెంబరు 25న ‘ఓజీ’తో పోటీ పడాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడటం గ్యారెంటీ అన్నది తాజా సమాచారం.

- Advertisement -

Also Read- Tollywood: టాలీవుడ్‌లో మైథ‌లాజిక‌ల్ సినిమాల ట్రెండ్ – భ‌క్తి క‌థ‌ల‌పై స్టార్ హీరోల మోజు

ఇప్పటివరకు అధికారికంగా వాయిదా అంటూ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, గత నెలలో విడుదల చేసిన టీజర్‌లో కూడా పాత డేట్‌నే ప్రకటించినా, సినీ సర్కిల్స్ సమాచారం మేరకు నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా పోస్ట్ పోన్ కానుందట. ఈ ఆలస్యానికి పలు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ‘అఖండ-2’ (Akhanda 2) చిత్రీకరణ చాలా వరకు పూర్తయినప్పటికీ, కొంత టాకీ పార్ట్, పాటలు ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. ముఖ్యంగా, ప్రయాగలో అనుకున్న చివరి షెడ్యూల్ వర్షాల వల్ల రద్దవడంతో చిత్రీకరణ కొంత ఆలస్యం కానుంది. దీనికి తోడు, విజువల్ ఎఫెక్ట్స్ పనులకు చాలా రోజులే పడుతుందట. మరోవైపు, సినిమాను పాన్ ఇండియా స్థాయిలో గట్టిగా ప్రమోట్ చేసి భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనే ప్లాన్ కూడా ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే, సెప్టెంబరులో రిలీజ్ చేయాలంటే హడావుడి అవుతుంది కాబట్టి, డిసెంబరు మీదకి ఫోకస్ షిఫ్ట్ అయినట్లు సమాచారం.

‘అఖండ’ సినిమా కూడా డిసెంబరులోనే రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి గమనార్హం. ప్రస్తుతానికి అఖండ2 కోసం డిసెంబరు 18ని కొత్త రిలీజ్ డేట్‌గా పరిశీలిస్తున్నారట. త్వరలోనే డేట్ ఖరారు చేసి, మీడియాకు అధికారికంగా అప్‌డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. అఖండ నటించిన ప్రగ్యా జైశ్వాల్ సీక్వెల్‌లోనూ నటించింది. ఈ వాయిదాతో సినిమా మరింత పకడ్బందీగా వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read- Sethupathi on trolling: ట్రోలింగ్ కొత్తేం కాదు.. దాని నుంచి తప్పించుకోలేం: సేతుపతి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad