Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనులది టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరు కలిసి చేసిన సింహా, లెజెండ్, అఖండ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలకృష్ణతో అఖండ 2 సినిమా చేస్తున్నాడు బోయపాటి శ్రీను. అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పోస్ట్‌పోన్ కానుందా…
కాగా అఖండ 2 (Akhanda 2) పోస్ట్‌పోన్ కానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ షూటింగ్ ఇక ఇరవై రోజులుపైనే బ్యాలెన్స్‌గా ఉన్నట్లు చెబుతోన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వరకు పెండింగ్‌లోనే ఉన్నాయని సమాచారం. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను హడావిడిగా కంప్లీట్ చేయడం కంటే కొంత టైమ్ తీసుకోవడమే మంచిదనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. అందుకే రిలీజ్‌ను వాయిదా వేయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
Also Read – Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. కాల్పులు జరిపిన గన్‌మెన్లు
డిసెంబర్ లో రిలీజ్…
అఖండ 2 సెప్టెంబర్ నుంచి డిసెంబర్‌లోకి వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. కొత్త రిలీజ్ డేట్ కోసం చాలా కసరత్తులు చేసిన మేకర్స్ చివరకు డిసెంబర్ 18ని ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 5న ప్రభాస్ రాజాసాబ్ రాబోతుంది. రాజాసాబ్ సందడి తగ్గడానికి ఎటు లేదన్నా పది రోజులు పడుతుంది. ఆ తర్వాత అఖండ 2 వచ్చిన ఓపెనింగ్స్‌పై పెద్దగా ఎఫెక్ట్ ఉండదని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. దాదాపు డిసెంబర్ 18 డేట్ కన్ఫామ్ కానుందని అంటున్నారు. త్వరలోనే రిలీజ్ పోస్ట్‌పోన్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని తెలిసింది.
సంయుక్త మీనన్ హీరోయిన్…
అఖండ 2 మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సల్మాన్ ఖాన్ భజరంగీ భాయిజాన్‌లో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ నటి హర్షాలీ మెహతా అఖండ 2తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించబోతున్నది.
Also Read – Rajya Sabha: రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన రాష్ట్రపతి
తమన్ మ్యూజిక్…
అఖండ 2లో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. అఖండ 2 తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయబోతున్నాడు బాలకృష్ణ. ఎన్‌బీకే 111 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈటీవల అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.


