Balakrishna: టాలీవుడ్‌లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్, రవితేజ మాస్ జాతరతో పాటు పలు భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్‌లు పోస్ట్‌పోన్ అయ్యాయి. తాజాగా ఈ లిస్ట్‌లో అఖండ 2 కూడా చేరింది. సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సిన బాలకృష్ణ మూవీ పండగ రేసు నుంచి వెనక్కి తగ్గింది. సినిమాను వాయిదా వేయడానికి గల కారణాలను గురువారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.
రాజీ పడకూడదనే…
రీ రికార్డింగ్, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తికావడానికి మరింత సమయం అవసరమవుతుందని, క్వాలిటీ, విజువల్స్ విషయంలో రాజీపడకూడదనే సినిమాను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అభిమానులకు అత్యుత్తమమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందివ్వడమే కాకుండా వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అవిశ్రాతంగా కష్టపడుతున్నామని మేకర్స్ పేర్కొన్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు. అఖండ 2 ఓ సినిమా కాదు… సినిమా పండగలా ఉండబోతుందని తెలిపారు.
సెప్టెంబర్ 25న అఖండ 2తో పాటు పవన్ కళ్యాణ్ ఓజీని ప్రేక్షకుల ముందుకు రావాల్సిఉంది. ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. కానీ అఖండ 2 వాయిదాపడటంతో పవన్ కళ్యాణ్ ఓజీ సోలోగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read – వరదల మధ్య “పాలిటికల్ వార్మ్ మొమెంట్”.. ఆప్యాయంగా పలకరించుకున్న బండి సంజయ్-కేటీఆర్
అఖండ సీక్వెల్…
అఖండ 2 మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. 2021లో రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన అఖండ మూవీకి సీక్వెల్‌గా అఖండ 2 రూపొందుతోంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోండగా ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించబోతున్నాడు. బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
నాలుగో మూవీ…
బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న నాలుగో మూవీ ఇది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ పెద్ద విజయాలను సాధించాయి. దాంతో అఖండ2పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇటీవలే టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో హై ఇంటెన్స్ యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకున్నారు బాలకృష్ణ.
అఖండ 2 తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయబోతున్నాడు బాలకృష్ణ . వీరసింహారెడ్డి తర్వాత వీరిద్దరు కలిసి చేస్తున్న ఈ మూవీ త్వరలో సెట్స్‌పైకి రానుంది.
Also Read – Xiaomi News: షియోమీకి ఆపిల్, శాంసంగ్ నోటీసులు.. వ్యంగ్యంగా యాడ్స్ ఆపాలని సూచన..


