71st National Film Awards: కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ అవార్డులను ప్రకటించింది. నాన్ ఫీచర్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్ కు ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ (12th Fail) సినిమా నిలిచింది. ఉత్తమ కథానాయకుడి అవార్డును ఇద్దరు హీరోలు షేర్ చేసుకుంటున్నారు. జవాన్ సినిమాకుగానూ షారూక్ ఖాన్ (Shah Rukh Khan).. 12th ఫెయిల్ సినిమాకుగానూ విక్రాంత్ మస్సె బెస్ట్ యాక్టర్ అవార్డులను అందుకుంటున్నారు. తెలుగు సినిమాల విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా, శ్రీలీల (Sreeleela) ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి మూవీకి ఉత్తమ చిత్రం అవార్డ్ దక్కింది. గ్రాఫిక్స్‌తో పాటు ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ మూవీగా జై హను మ్యాన్ సినిమా అవార్డును దక్కించుకుంది.
భగవంత్ కేసరి విషయానికి వస్తే కుమార్తె అభ్యున్నతికి పాటుపడే తండ్రి పాత్రలో బాలకృష్ణ నటించారు. కూతురుని చదివించి ఆర్మీ ఆఫీసర్ చేయాలనే కోరికతో కష్టపడే తండ్రిగా బాలయ్య ఇందులో నటించగా, కుమార్తె పాత్రలో శ్రీలీల నటించింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాకు జాతీయ అవార్డ్ రావటంపై అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో రాణిస్తున్న తరుణంలో మరోసారి భగవంత్ కేసరి అవార్డును అందుకుంటోంది.
Also Read – Mrunal Thakur Birthday: మృణాల్ ఠాకూర్ బర్త్ డే.. స్పెషల్ పోస్టర్ రిలీజ్
బాలకృష్ణ ఇందులో నేలకొండ భగవంత్ కేసరి అనే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. ఆయనకు జతగా కాజల్ అగర్వాల్ నటించింది. కమర్షియల్ ఎంటర్‌టైనింగ్ చిత్రాలను తెరకెక్కించటంలో స్పెషలిస్ట్ అయిన అనీల్ రావిపూడి తన పంథాను మార్చి డిఫరెంట్‌గా ఈ సినిమాను తెరకెక్కించటం విశేషం. వీరి కాంబోలో వచ్చిన తొలి సినిమా ఇది.
ప్రస్తుతం బాలకృష్ణ తన నెక్ట్స్ మూవీ అఖండ 2ను పూర్తి చేయటంపై బిజీగా ఉన్నారు. అఖండ సినిమాకు ఇది సీక్వెల్. దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయబోతున్నారు. అలాగే క్రిష్ దర్శఖత్వంలోనూ ఓ పీరియాడిక్ మూవీ చేయనున్నారు. తర్వాత ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఆదిత్య 999ను రూపొందించనున్నారు. దీనికి ఆయనే దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లు సమాచారం.


