Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభJailer 2: బాలయ్య క్రేజీ డెసిషన్స్.. రెండు సినిమాలు రిజెక్ట్!

Jailer 2: బాలయ్య క్రేజీ డెసిషన్స్.. రెండు సినిమాలు రిజెక్ట్!

Balayya: నందమూరి బాలకృష్ణకి ఇప్పుడు కెరీర్ పరంగా గోల్డెన్ పీరియడ్ నడుస్తోంది. వరుస హిట్‌లతో దూసుకుపోతున్న బాలయ్య బాబు ప్రస్తుతం ‘అఖండ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవగానే, ‘వీరసింహారెడ్డి’ లాంటి మాస్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో భారీ ఎంటర్‌టైనర్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ కమిట్‌మెంట్స్ మధ్య ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

- Advertisement -

ALSO READ: Mithra Mandali: ఓటీటీలోకి కొత్త వెర్షన్ తో ‘మిత్ర మండలి’ మూవీ!

రెండు భారీ ప్రాజెక్టులకు బాలయ్య నో!

అసలు విషయానికి వస్తే… బాలయ్య బాబు రీసెంట్ గా ఏకంగా రెండు క్రేజీ ప్రాజెక్టులను రిజెక్ట్ చేసాడట. అందులో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్ ‘ఆంధ్రా కింగ్ తాలుకా’. ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా బాలకృష్ణ ఒప్పుకోలేదట. దాంతో, ఆ రోల్ కోసం చివరికి కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను చేసాడు. ఇక రెండోది మరీ పెద్ద ప్రాజెక్ట్! సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘జైలర్ 2’లో ఒక కీ రోల్ కోసం బాలయ్యను సంప్రదించారట. దాదాపుగా సినిమా ఓకే అయినట్టే అనుకున్నా, చివరి నిమిషంలో ఆయన తప్పుకున్నారని వార్త. ఆ రోల్ ను ఇప్పుడు మలయాళ నటుడు ఫాహద్ ఫాసిల్ చేసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ALSO READ: Rahul: తాళిపై రాహుల్ రవీంద్రన్ చేసిన వ్యాఖ్యలు వైరల్!

వరుస విజయాల జోరులో ఉండి కూడా, ఇంతటి భారీ, క్రేజీ ప్రాజెక్టులను బాలకృష్ణ రిజెక్ట్ చేయడం చూస్తుంటే… ఆయన ఇకపై మరింత సెలెక్టివ్‌గా, డిఫరెంట్‌గా సినిమాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. గోపీచంద్ మలినేని సినిమా తర్వాత, బాలయ్య బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను దర్శకుడు క్రిష్‌తో చేయబోతున్నాడు అని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ కొత్త సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి, నటసింహం తన సినిమాల విషయంలో ఒక పక్కా ప్లాన్‌తోనే ముందుకు వెళ్తున్నాడని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad