Balakrishna: బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న అఖండ 2పై పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, హిందీతో పాటు మరో మూడు భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 25 అఖండ 2 రిలీజ్ కావాల్సి ఉండగా ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవడంతో వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు.
స్ట్రెయిట్ మూవీకి ధీటుగా…
కాగా అఖండ2 ను హిందీలో స్ట్రెయిట్ మూవీకి ఏ మాత్రం తగ్గకుండా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ హిందీ వెర్షన్ కోసం బాలకృష్ణ స్వయంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పారట. తొలుత వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో హిందీ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పించాలని మేకర్స్ అనుకున్నారట. కానీ బాలకృష్ణ అందుకు అంగీకరించలేదని సమాచారం. హిందీలో తానే సొంతంగా డబ్బింగ్ చెప్పేశారట. హిందీ వెర్షన్‌కు బాలకృష్ణ డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు.
డిసెంబర్‌లోనే రిలీజ్…
కాగా అఖండ 2 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అందులో నిజం లేదని సమాచారం. డిసెంబర్ నెలలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ఫిక్సైనట్లు చెబుతున్నారు. డిసెంబర్ 5 లేదా 12లలో ఓ డేట్‌ను ఖరారు చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. నవంబర్‌లో రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
సంయుక్త మీనన్ హీరోయిన్…
అఖండ మూవీకి సీక్వెల్‌గా బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. అఖండ 2లో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోండగా… బాలీవుడ్ నటి హర్షాలీ మల్హోత్రా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నది. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు.
ఓటీటీ రైట్స్…
రిలీజ్‌కు ముందే అఖండ 2 ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను 85 కోట్లకు జియో హాట్ స్టార్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న నాలుగో సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.
Also Read – OG movie : వామ్మో.. ఇదెక్కడి మాస్! ‘ఓజీ’ ఫస్ట్ టికెట్ రూ. 5 లక్షలు


